Rabies Risk: వంద దేశాల కుక్కలకు నో ఎంట్రీ అంటోన్న అమెరికా

దాదాపు 100 దేశాల నుంచి కుక్కలను అమెరికాకు తీసుకురావొద్దని అమెరికా ఆరోగ్య అధికారులు ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకురావాల్సి వస్తే.. ర్యాబిస్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాల్సిందే. దేశవ్యాప్తంగా చాలా కుక్కపిల్లల్లో ర్యాబిస్ కేసులు ఎక్కువవుతుండటంతో...

Rabies Risk: దాదాపు 100 దేశాల నుంచి కుక్కలను అమెరికాకు తీసుకురావొద్దని అమెరికా ఆరోగ్య అధికారులు ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకురావాల్సి వస్తే.. ర్యాబిస్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాల్సిందే. దేశవ్యాప్తంగా చాలా కుక్కపిల్లల్లో ర్యాబిస్ కేసులు ఎక్కువవుతుండటంతో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది.

ఈ నిషేదాన్ని జులై 14నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ఆరోగ్యకరమైన జంతువులు తీసుకురావాలని చెప్పారు. ర్యాబిస్ వ్యాప్తి ఎక్కువవుతోన్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కండక్ట్ చేసిన అమెరికా.. మహమ్మారి వ్యాప్తి కారణంగా కొద్ది రోజుల పాటు నిలిపేసింది.

ట్రెండింగ్ వార్తలు