US Covid Deaths : అమెరికాలో 8లక్షలు దాటిన కోవిడ్ మరణాలు..వ్యాక్సిన్ తీసుకున్నా కూడా

అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య మంగళవారం నాటికి 8 లక్షలు దాటింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలను నమోదు చేసిన దేశంగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా

అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య మంగళవారం నాటికి 8 లక్షలు దాటింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలను నమోదు చేసిన దేశంగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన 5.3 మిలియన్ల మరణాలలో 15 శాతం కేవలం అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికా తర్వాత బ్రెజిల్ కరోనా మరణాలు అధికంగా నమోదయ్యాయి. బ్రెజిల్ లో కోవిడ్ మృతుల సంఖ్య 6లక్షలు దాటింది.

అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అనేకమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడం కీలక పరిణామాం. అమెరికాలో కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ మొదలయ్యే నాటికి దేశంలో మరణించిన వారి సంఖ్య దాదాపు 3లక్షల దగ్గర ఉంది.

గతేడాది డిసెంబర్ లో అమెరికాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమై తర్వాత 5 లక్షల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 2లక్షల 30వేల మరణాలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నమోదయ్యాయి. ఇక,అమెరికాలో నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య… అట్లాంటా, సెయింట్ లూయిస్ జనాభాతో సమానం.

ALSO READ Politicians MMA fighting : బాక్సింగ్ రింగ్‌లో ఇద్దరు రాజకీయ నేతల ఫైటింగ్..ఈలలు,చప్పట్లతో హోరెత్తించిన జనాలు

ట్రెండింగ్ వార్తలు