Politicians MMA fighting : బాక్సింగ్ రింగ్‌లో ఇద్దరు రాజకీయ నేతల ఫైటింగ్..ఈలలు,చప్పట్లతో హోరెత్తించిన జనాలు

ఇద్దరు రాజకీయవేత్తలు విమర్శలు, ఆరోపణలతో ఊరుకోలేదు. ఏకంగా ఫైటింగ్ కు దిగారు. బాక్సింగ్ రింగ్‌లో ఫైటింగ్ చేసుకోవటంతో జనాలు ఈలలు,చప్పట్లతో హోరెత్తించారు.

Politicians MMA fighting : బాక్సింగ్ రింగ్‌లో ఇద్దరు రాజకీయ నేతల ఫైటింగ్..ఈలలు,చప్పట్లతో హోరెత్తించిన జనాలు

Brazil Politicians Mma Fight

Brazil politicians MMA fight : రాజకీయాల్లో పార్టీల నేతలు ఒకరినొకరు విమర్శలు చేసుకోవటం..ఆరోపణలు చేసుకోవటం సర్వసాధారణం.కాస్త దమ్ముంటే రా తేల్చుకుందాం నువ్వో నేనో అంటూ శృతిమించితే సవాళ్లు కూడా విసురుకుంటారు. కానీ ఏకంగా బాక్సర్లలాగా కొట్టేసుకోవటం గురించి ఎక్కడా విని ఉండం. కానీ చర్చలతో తేల్చుకుంటే కిక్కేముంది అనుకున్నారో ఏమోగానీ..బ్రెజిల్‌ ఏకంగా బాక్సింగ్ రింగ్‌లో ఫైటింగ్ కు తలపడ్డారు ఇద్దరు రాజకీయ నేతలు. బ్రెజిల్‌కు చెందిన పీక్సోటో, అల్వాస్ డా సిల్వా అనే ఆ ఇద్దరు నేతల ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more : Omicron : హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం

బ్రెజిల్‌లోని బోర్బా నగర మేయర్‌ సిమావో పీక్సోటో. అతనిపై ఇటీవల మాజీ మేయర్ అల్వాస్ డా సిల్వా పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరు వాదించుకున్నారు. నువ్వు అంటే నువ్వు అంటూ ఆరోపణలు చేసుకున్నారు. స్థానికంగా వాటర్ పార్క్‌ నిర్వహణలో మేయర్ పీక్సోటో విఫలమయ్యారని మాజీ మేయర్ అల్వాస్ డా సిల్వా సిమావోపై పలు ఆరోపణలు చేశారు. పీక్సీటో ఓ మోసగాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో పీక్సీటో కూడా ఏమాత్రం తగ్గలేదు. మీ చేతకాని తనం వల్లే ఇదంతా జరిగింది అంటూ విరుచుకుపడ్డారు. దీంతో మాజీ మేయర్ అల్వాస్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీక్సీటోని ‘‘దమ్ముంటే నాతో ఫైటింగ్‌కు రా..నువ్వో నేనో తేల్చుకుందాం’’ అంటూ సవాల్ విసిరారు.

అటు పీక్సోటో కూడా అంతే ధీటుగా రియాక్ట్ అయ్యారు. సిల్వాతో ఫైట్‌కు నేను రెడీ అన్నారు. దీంతో ఇద్దరి మధ్య మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA fight) ఫైట్ నిర్వహించారు. వీరిద్దరి మధ్యా దాదాపు 13 నిమిషాల పాటు ఫైట్‌ జరిగింది. ఈ ఫైట్ లో మేయర్ పీక్సోటోని మాజీ మేయర్ డా సిల్వా చిత్తుగా ఓడించాడు.

Read more : Rajnath Singh:ఇండో-పాక్ యుద్ధ వీరుడు కల్నల్ హోషియార్ సింగ్ భార్య పాదాలకు నమస్కరించిన మంత్రి రాజ్‌ నాథ్ సింగ్..

రాజకీయ వేత్తలు కదా..ఫైట్ తరువాత ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఇద్దరు పొలిటీషియన్స్ మధ్య జరిగిన ఈ ఫైట్‌ చూడటానికి జనాలు కూడా మంచి ఉత్సాహం చూపుతు వారి ఫైట్ చూడటానికి భారీగా ఎగబడ్డారు. దీంతో ఈ మ్యాచ్ కోసం ఒక్కో టికెట్‌ను R$100 (Brazil currency)కి విక్రయించారు. ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతున్నంత సేపు జనాలు ఈలల, కేకలతో హోరెత్తించారు. ఆదివారం (సెప్టెంబర్ 12) జరిగిన ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజకీయ నాయకులే ఇలా యుద్ధాలకు దిగి ఏం సందేశమిస్తున్నారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.