Omicron : హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం

తెలంగాణలోకి కూడా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రవేశించింది. హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం అయింది. నగరంలోని బంజారాహిల్స్ పారమౌంట్ కాలనీలో బాధితుడిని కనుగొన్నారు.

Omicron : హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం

Omicron (5)

Omicron victim found in Hyderabad : ప్రపంచ దేశాలను విణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ ను కలవర పెడుతోంది. తెలంగాణలోకి కూడా ఒమిక్రాన్ ప్రవేశించింది. హైదరాబాద్ లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు.

హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం అయింది. నగరంలోని బంజారాహిల్స్ పారమౌంట్ కాలనీలో బాధితుడిని కనుగొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌తో తప్పిపోయిన సోమాలియన్‌ను బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీ వద్ద సిటీ పోలీసులు అదుపులోకి తిసున్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.

Omicron : ఒమిక్రాన్‌‌తో ఆందోళన వద్దు..భోజనం సమయంలోనే మాస్క్ తీయాలి – డీహెచ్

అతను డిసెంబర్ 12వ తేదీన షార్జా నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అతడికి 12వ తేదీన కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అతన్ని గచ్చిబౌలి లోని టిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. ప్రస్తుతం అతనికి వైద్యం అందిస్తున్నారు.
అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు డీహెచ్ తెలిపారు. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించడం జరిగిందని వెల్లడించారు.

కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు, జీనోమ్ సెక్వెన్సింగ్ లో మంగళవారం రాత్రి నిర్ధారణ అయ్యిందని తెలిపారు. డిసెంబర్ 12న సొమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఆ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. వీరిద్దరూ కూడా టోలిచౌకి ఏరియాకు చెందిన వారని పేర్కొన్నారు.

West godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. 9మంది మృతి

భారత్ లో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ గా నమోదైనా అతనికి మళ్లీ టెస్ట్ చేయగా..నెగెటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి ఏపీలో ఒమిక్రాన్ కేసులు లేనట్టేనని భావిస్తున్నారు.