Rajnath Singh:ఇండో-పాక్ యుద్ధ వీరుడు కల్నల్ హోషియార్ సింగ్ భార్య పాదాలకు నమస్కరించిన మంత్రి రాజ్‌ నాథ్ సింగ్..

రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్.. పరమ వీర్ చక్ర పురస్కారం పొందిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య పాదాలకు నమస్కారం చేశారు.

Rajnath Singh:ఇండో-పాక్ యుద్ధ వీరుడు కల్నల్ హోషియార్ సింగ్ భార్య పాదాలకు నమస్కరించిన మంత్రి రాజ్‌ నాథ్ సింగ్..

Rajnath Singh Touches Feet Of Pvc Awardee’s Wife (2)

Rajnath Singh touches feet of PVC awardee’s wife: దేశ రాజధాని ఢిల్లీలో స్వర్ణిం విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అరుదైన దృశ్యం కనిపించింది. 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధ వీరులను స్మరించుకుని..వారి కుటుంబ సభ్యుల్ని గౌరవించుకునేందుకు మంగళవారం (డిసెంబర్ 14,2021) ఏర్పాటు చేసిన స్వర్ణిం విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్.. పరమ వీర్ చక్ర పురస్కారం పొందిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య పాదాలకు నమస్కారం చేశారు.

Read more : CDS chopper Crash : కన్నుమూసిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్, సంతాపం తెలిపిన మోదీ

1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో దేశం విజయం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధనో దేవిని మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ మనసారా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధనోదేవి పాదాలకు నమస్కరించి వారి పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. 1971 ఇండియా – పాకిస్థాన్ యుద్ధం పూర్తయి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 50వ వార్షిక వేడుకలు సమీపిస్తున్న క్రమంలో ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కల్నల్ హోషియార్ సింగ్ భార్య పాదాలకు నమస్కరించారు.

కాగా..బంగ్లాదేశ్‌కి విముక్తి ప్రసాదించిన 1971 నాటి భారత్ – పాకిస్థాన్ యుద్ధంలో వీరుడిగా పేరు సంపాదించుకున్న కల్నల్ హోషియార్ సింగ్‌కి భారత ప్రభుత్వం పరమ వీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు.. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని న్యాయం కోసం జరిగిన యుద్ధంగా అభివర్ణించారు. ఆ యుద్ధం వల్లే బంగ్లాదేశ్ పేరుతో ఓ కొత్త దేశం ఏర్పడిందని రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేసుకున్నారు. బంగ్లాదేశ్ పట్ల భారత్‌కి ఉన్న మానవతా దృక్పథాన్ని ఈ యుద్ధం ప్రపంచానికి చాటిచెప్పిందని అలనాటి ఘటనలకు గుర్తు చేశారు.

 

Read more : Chennai : మాజీ గవర్నర్ నరసింహన్‌‌కు అస్వస్థత…పరామర్శించిన సీఎం కేసీఆర్

డిసెంబర్ 16న భారత్ విజయ్ దివాస్ జరుపుకోనుంది. 1971 లో డిసెంబర్ 16 నాడే పాకిస్థాన్ ఆర్మీతో పాటు పాకిస్థాన్‌కి చెందిన 93 వేల మంది సైనిక బలగాలు భారత రక్షణ బలగాల ఎదుట లొంగిపోయాయని..ఈ యుద్ధంలో పాకిస్థాన్ ఎంతో నష్టపోయిందని గుర్తు చేశారు.పాకిస్థాన్ ఆర్మీలో మూడో వంతు, నేవీ బలగాల్లో సగం మంది, ఎయిర్ ఫోర్స్ బలగాల్లో నాలుగో వంతు కోల్పోయిందని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

హోషియార్ సింగ్ దహియా హర్యానాలోని సోనిపట్ జిల్లా..సిసానా గ్రామంలో చౌదరి హీరా సింగ్‌కు జన్మించారు. రోహ్‌తక్‌లోని జాట్ కళాశాలలో చదువు తర్వాత ఆర్మీలో చేరారు. ఆయన ధనో దేవిని వివాహం చేసుకున్నారు. 30 జూన్ 1963న ది గ్రెనేడియర్స్ రెజిమెంట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీలో నియమించబడి లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందారు. హోషియార్ సింగ్ తన 61 ఏట..రాజస్థాన్ లోని జైపూర్ లో మరణించారు.