CDS chopper Crash : కన్నుమూసిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్, సంతాపం తెలిపిన మోదీ

మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. దాదాపు 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు.

CDS chopper Crash : కన్నుమూసిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్, సంతాపం తెలిపిన మోదీ

Varun

Group Captain Varun Singh : మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. దాదాపు 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. డిసెంబర్ 8న జరిగిన ఎంఐ-17 హెలీకాప్టర్ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అతడిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు మిలటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యంగా కోలుకుని రావాలని ప్రజలు కోరుకున్నారు.

Read More : Chennai : మాజీ గవర్నర్ నరసింహన్‌‌కు అస్వస్థత…పరామర్శించిన సీఎం కేసీఆర్

కానీ..ఆరోగ్యం విషమించి…2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం ఉదయం రక్షణ శాఖ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వరుణ్ సింగ్ మృతి పట్ల భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వరుణ్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. వరుణ్ సింగ్ మృతితో మొత్తం మృతుల సంఖ్య 14కు చేరింది. వరుణ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియా జిల్లాకు చెందిన వారు.

Read More : West godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. 9మంది మృతి

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వరుణ్ సింగ్ గర్వంగా, పరాక్రమంతో, అత్యంత వృత్తి నైపుణ్యంతో దేశానికి సేవ చేశారని కొనియాడారు. ఆయన మృతి పట్ల తీవ్ర వేదనకు లోనయ్యానని, దేశానికి వరుణ్ సింగ్ చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిదన్నారు.వరుణ్ సింగ్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మోదీ సంతాపం తెలిపారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో డిసెంబర్ 08వ తేదీ బుధవారం మధ్యాహ్నాం భారత వాయుసేనకు చెందిన Mi-17V5 హెలికాఫ్టర్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో త్రివిధ దళాధితి బిపిన్ రావత్,ఆయన భార్య సహా మొత్తం 14మంది ఉన్నారు.