US Election 2024 : ఎక్కడో అమెరికాలో ఎన్నికలు. కానీ, ప్రపంచం మొత్తం ఊపిరిబిగపట్టుకుని ఆ ఎన్నికలవైపు చూస్తోంది. అమెరికాలో ఏం జరగబోతోంది? ఎవరు గెలుస్తారు? ట్రంప్ గెలిస్తే ఏం ట్విస్ట్ ఇస్తారు? కమల నెగ్గితే ఏం బెస్ట్ ఇస్తారు? ఎవరి లెక్కలు వారికున్నాయి. మరి భారత మార్కెట్లకు ఈ ఇద్దరిలో ఎవరు బూస్ట్ ఇస్తారు. రక్షణ రంగం విషయానికి వస్తే ట్రంప్ గెలిస్తే బెటరా, కమల నెగ్గితే ప్రయోజనమా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ప్రతీ దేశంలో అమెరికా ఎన్నికలు, ఫలితాలపై చర్చ జరుగుతోంది. ట్రంప్, కమల.. ఇద్దరిలో ఎవరు నెగ్గుతారోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అమెరికా పెద్దన్న దేశంగా ఉంది. అక్కడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిని డిసైడ్ చేస్తాయి. పలు దేశాలకు ఇచ్చే మద్దతులు కూడా తారుమారైపోతాయి. అందుకే, అభ్యర్థుల ప్రసంగాలను, హామీలను ప్రపంచ దేశాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ తో ఎదురు చూస్తున్నాయి.
చైనా, పాకిస్తాన్ పట్ల డెమోక్రాట్లు పెద్దగా వ్యతిరేకంగా కనిపించడం లేదు. కానీ, ట్రంప్ చైనాకు బద్ధ వ్యతిరేకిగా ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ అంటే ట్రంప్ కు పెద్దగా నచ్చదు. దీంతో పాక్ ప్రజలు డెమోక్రాట్ల గెలుపునే కోరుకుంటున్నారు. ట్రంప్ గెలిస్తే చైనాపై పోరులో భారత్ కు అమెరికా మద్దతు లభించే అవకాశం ఉంది.
మరోవైపు డెమోక్రాట్లు గెలిస్తే మన వాళ్ల ఉద్యోగాలకు డోకా ఉండదు. ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే విదేశీ వలసదారులపై కఠిన వైఖరి తప్పేలా లేదు. తాను గెలిస్తే రష్యాతో ఒప్పందం కుదుర్చుకునేలా ఒత్తిడి తెస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. మరోవైపు ట్రంప్ గెలిస్తే.. చైనా, ఇరాన్.. అమెరికాకు శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. హారిస్ అధ్యక్షురాలైతే రష్యా సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇజ్రాయెల్ విషయంలో మాత్రం ఇద్దరు అభ్యర్థుల తీరు ఒకేలా ఉంది.
Also Read : అమెరికా ఎన్నికలు.. హాలీవుడ్ సెలెబ్రిటీలు, బిజినెస్ టైకూన్స్ ఎవరి వైపు?