యుద్ధాలు అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది..

ప్రపంచ దేశాలను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. కొరియాల యుద్ధం, చైనా తైవాన్ ఉద్రిక్తతల సంగతి ఎలా ఉన్నా.. రెండేళ్లుగా సాగుతున్న యుక్రెయిన్, రష్యా వార్.. కయ్యానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వ్యవహారం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్త చర్చకు దారితీస్తోంది.

War Impact On US Election 2024 (Photo Credit : Google)

US Presidential Election : ప్రపంచం అంతా యుద్ధాల్లో ఉందా.. యుద్ధంలో ప్రపంచం ఉందా అనే అనుమానాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. వరల్డ్ లో ఎక్కడ ఏం జరిగినా.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికాకు సంబంధం ఉంటుంది. మరిప్పుడు జరుగుతున్న యుద్ధాలు అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. యూఎస్ అధ్యక్ష ఎన్నికలపై ఏ రేంజ్ లో పడే ఛాన్స్ ఉంది.

ప్రపంచ దేశాలను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. కొరియాల యుద్ధం, చైనా తైవాన్ ఉద్రిక్తతల సంగతి ఎలా ఉన్నా.. రెండేళ్లుగా సాగుతున్న యుక్రెయిన్, రష్యా వార్.. కయ్యానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వ్యవహారం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్త చర్చకు దారితీస్తోంది. ఆర్థిక, సైనిక శక్తితో అనేక కూటములలో అమెరికా పోషిస్తున్న కీలక పాత్ర కారణంగా యూఎస్ గురించి ఇప్పుడు చర్చకు వస్తోంది.

అమెరికా ఎన్నికలు ప్రపంచంపై ఎటువంటి పరిణామాలను చూపుతాయనే విషయంపై చర్చ జరుగుతోంది. పెద్దన్న పాత్రలో ప్రపంచంలో ఏర్పడిన అస్థిరతకు ఎన్నికల తర్వాత యూఎస్ ఓ దారి చూపిస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది. అయితే, ఇదంతా ఎలా ఉన్నా.. యుద్ధ పరిణామాలు అమెరికా ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది మరో కీలక అంశంగా మారింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పశ్చిమాసియా పరిణామాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ విషయంలో అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యింది. అమెరికాలోని 7 స్వింగ్ స్టేట్స్ లో ఒకటైన మిషిగన్ లాంటి స్వింగ్ సేట్ పై ఇది తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.

మిషిగన్ లో పాలస్తీనియన్లతో పాటు లెబనీస్ అమెరికన్లు భారీ సంఖ్యలో ఉన్నారు. 2020లో బైడెన్ విజయానికి వీరే పరోక్షంగా హెల్ప్ చేశారు. ఇజ్రాయెల్ కు డెమోక్రాట్ల మద్దతు కొనసాగుతుండటం, ఇజ్రాయెల్ యుద్ధం ఆపేలా దౌత్యపరమైన చర్యలు జరపడంలో బైడెన్ ఫెయిల్ కావడంతో డెమోక్రాట్లపై పాలస్తీనియన్లు, లెబనీస్ అమెరికన్లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇకిప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ మళ్లీ దాడులకు సిద్ధమవుతోంది. అమెరికా వార్నింగ్ ను కూడా బేఖాతరు చేస్తోంది. అంటే, పశ్చిమాసియా సంఘర్షణలపై అమెరికా నియంత్రణ దాదాపు లేనట్లే. బైడెన్ సర్కార్ మీద, డెమోక్రాట్ల మీద ఇది ప్రభావం చూపించే అంశమే కచ్చితంగా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

Also Read : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఆ నాలుగు జాతులు ఎవరివైపు? ఎవరికి జై కొట్టబోతున్నారు?