North Korea: ఉత్తర కొరియా పర్యటన నిషేధం మరో ఏడాది పొడిగింపు.. అమెరికా ప్రభుత్వం ఏమందంటే?

ఉత్తర కొరియాపై అమెరికా నిషేధం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ పర్యటన నిషేధం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం బుధవారం తెలిపింది. 2

North Korea: ఉత్తర కొరియాపై అమెరికా నిషేధం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ పర్యటన నిషేధం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం బుధవారం తెలిపింది. 2017 నుంచి ఈ నిషేధాన్ని అమెరికా అమలు చేస్తోంది. ఆ యేడాది ప్రచార పోస్టర్‌ని దొంగలించాడనే ఆరోపణలతో అమెరికా విద్యార్థి ఒట్టో వార్మ్‌బియర్‌ని ఉత్తర కొరియా పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేయడంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఉత్తరకొరియా పర్యటనలను అమెరికా నిషేధించడం ప్రారంభించింది.

Sri Lanka : చాక్లెట్లు,షాంపులతో సహా 300 వస్తువుల దిగుమతిపై నిషేధం విధించిన శ్రీలంక

2017 నుంచి ప్రతీయేటా నిషేధాన్ని పెంచుతూ వస్తోంది. తాజాగా 2023 ఆగస్టు 31 వరకు ఉత్తర కొరియా పర్యటన నిషేధం విధిస్తూ అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్రత్యేకంగా ఆ పర్యటనకు ధృవీకరించినప్పుడే మినహా మరే విధంగానూ అమెరికా వీసాలు చెల్లుబాటు కావని ప్రభుత్వం పేర్కొంది. యూఎస్ పౌరులకు ఉత్తర కొరియా పర్యటన అత్యంత ప్రమాదకరమని వారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని అమెరికా పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు