Sri Lanka : చాక్లెట్లు,షాంపులతో సహా 300 వస్తువుల దిగుమతిపై నిషేధం విధించిన శ్రీలంక

తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న భారత్ పొరుగు దేశం శ్రీలంక విదేశీ మారక ద్రవ్యం కొరత ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే.

Sri Lanka : చాక్లెట్లు,షాంపులతో సహా 300 వస్తువుల దిగుమతిపై నిషేధం విధించిన శ్రీలంక

sri lanka

Sri Lanka : తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న భారత్ పొరుగు దేశం శ్రీలంక విదేశీ మారక ద్రవ్యం కొరత ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్నిరకాల ప్రయత్నాలను చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీలంక ప్రభుత్వం చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్‌, షాంపూలు తదితర 300 వస్తువుల దిగుమతిపై నిషేధిం విధించింది. అయితే ఈ 300 రకాల వస్తువులు ఆగస్టు 23లోపు ఎగుమతి జరిగి సెప్టెంబర్ 14 లోపు దేశం చేరుకుంటే వాటికి అనుమతి ఉంటుందని పేర్కోంది. ఏప్రిల్ నెలలో ఫారెక్స్ సంక్షోభం కారణంగా శ్రీలంక అంతర్జాతీయ రుణాన్ని తీర్చలేమని ప్రకటించింది.

1948 లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ద్వీప దేశం సంక్షోభంలో చిక్కుకుంది. అధ్వాన్న స్థితికి చేరిన ఫారెక్స్‌ నిల్వల కారణంగా నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి జనం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు.

చివరకు గొటబయ రాజపక్స ప్రభుత్వం సైతం దిగిపోవాల్సిన పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే. శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రత్యేక నోటిఫికేషన్‌లో చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్‌, మేకప్‌, షాంపూలతో అనేక రకాల ఉత్పత్తులు సహా మొత్తం 300 వస్తువుల దిగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది.

ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయంటూ పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే లంక అధికారులు ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఐఎంఎఫ్‌ ప్యాకేజీ అందుబాటులోకి వస్తుందని శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ నందలాల్‌ వీరసింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : Liquor Scam : ఢిల్లీలో డొంక కదిలితే .. తెలుగు రాష్ట్రాల్లో మూలాలు-లిక్కర్ స్కామ్ పై జీవీఎల్