Fighter Crash
Fighter Crash : దక్షిణ కొరియాలో కూలిపోయిన యూఎష్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ సోమవారం కుప్పకూలిపోయింది. సియోల్‌కు దక్షిణంగా 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న గున్సాన్‌లోని వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన తర్వాత ఫైటర్ జెట్ నీటిలో కూలిపోయింది. పైలట్ అత్యవసరంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని యూఎస్ వర్గాలు తెలిపాయి. ఫైటర్ జెట్ కూలిపోతున్న సమయంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.
ALSO READ : Telangana : కార్యరంగంలోకి దిగిన మంత్రులు…శాఖల వారీగా వేగిరంగా అభివృద్ధి పనులకు శ్రీకారం
ఈ ప్రమాద ఘటనపై స్పందించేందుకు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వశాఖ నిరాకరించింది. అణ్వాయుధ ఉత్తర కొరియా నుంచి రక్షించడంలో సహాయం చేయడానికి దక్షిణ కొరియాలో అమెరికా 28,500 మంది సైనికులను మోహరించింది. పొరుగున ఉన్న జపాన్‌లో 8 మంది యూఎస్ ఎయిర్‌మెన్ లు ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించారు.
ALSO READ : Telangana Cool Winds : తెలంగాణలో పెరిగిన చలిగాలులు…ప్రజలను వణికిస్తున్న చలి
ఈ ప్రమాదం తర్వాత వి-22 ఓస్ప్రే టిల్ట్-రోటర్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలను నిలిపివేస్తున్నట్లు యూఎస్ మిలిటరీ గత వారం ప్రకటించింది. యూఎస్ ఎఫ్ -16 ఫైటర్ జెట్ సోమవారం దక్షిణ కొరియాలో శిక్షణా వ్యాయామంలో కూలిపోయిందని యూఎస్ తెలిపింది.