United States
USA News : US ప్రభుత్వం 6 లైట్ హౌస్‌లను ఉచితంగా అందజేస్తోంది .. పెరిగిన టెక్నాలజీతో అవి వాడుకలో లేకపోవడం.. చారిత్రక భవనాలను పరిరక్షించడంలో భాగంగా ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
220 Kg Of Pasta in US Forest : యూఎస్ పారెస్ట్‌లో 220 కేజీల పాస్తా ఎందుకు పడేశారు?
యునైటెడ్ స్టేట్స్ లైట్ హౌస్‌లను సంరక్షించే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లైట్ హౌస్‌లను విక్రయిస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 10 లైట్ హౌస్ ప్రాపర్టీలు ఆఫర్‌లో ఉన్నాయట. వీటిలో 6 లైట్ హౌస్‌లను ఫెడరల్ ఏజెన్సీలు, రాష్ట్ర మరియు స్ధానిక ప్రభుత్వాలు, లాభాపేక్ష లేని సంస్థలు, విద్యా సంస్థలు మరియు కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్లకు ఫ్రీగా ఇవ్వబడతాయని US జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (GSA) తెలిపింది. ఇవి ఎవరికీ అందజేయలేకపోతే ఆన్ లైన్ వేలానికి ఉంచుతామని కూడా వెల్లడించింది. ఇక వీటిలో నాలుగు బహిరంగ వేలం వేయబడతాయట.
లైట్ హౌస్‌లు సముద్రంలో లోతట్టు జలాల్లో ఉన్నవారికి దిక్సూచిలా పనిచేస్తాయి. అలాగే ప్రమాదాలను గుర్తించడంతో పాటు నౌకలు సురక్షితంగా నౌకాశ్రయాలకు చేరేందుకు సూచనలు చేస్తాయి. అయితే పెరిగిన టెక్నాలజీతో నావిగేషన్‌కు లైట్ హౌస్‌లు అంతగా అవసరం లేకపోవడంతో ఇవి నిర్లక్ష్యం చేయబడుతున్నాయని.. లేదా కూల్చివేయబడతాయని GSA తెలిపింది. కాబట్టి ఎవరికైనా లైట్ హౌస్ కలలు ఉంటే నెరవేర్చుకోవచ్చును.