COVID boosters : అమెరికన్లకు కొత్త కొవిడ్ బూస్టర్…యూఎస్ ఆరోగ్యసంస్థ సిఫార్సు

అమెరికా దేశంలో తాజాగా కొవిడ్ మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా కొవిడ్ బూస్టర్లకు అమెరికన్ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. యూఎస్ వ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో 6 నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్లందరూ కొవిడ్ బూస్టర్‌ను స్వీకరించాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ సిఫార్సు చేశారు....

COVID boosters : అమెరికా దేశంలో తాజాగా కొవిడ్ మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా కొవిడ్ బూస్టర్లకు అమెరికన్ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. యూఎస్ వ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఆసుపత్రుల్లో రోగుల చేరికల మధ్య 6 నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్లందరూ కొవిడ్ బూస్టర్‌ను స్వీకరించాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ సిఫార్సు చేశారు. (US health agency recommends) కొవిడ్ బూస్టర్ కనుగొనడం ముఖ్యమైన మైలురాయి అని యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ చెప్పారు. (President Biden calls it important milestone)

Nipah virus : కేరళలో నిపా వైరస్ వ్యాప్తి…కేంద్ర నిపుణుల బృందం రాక

పీజర్ బయోఎన్ టెక్, మోడర్నా తయారు చేసిన ఈ బూస్టర్ ప్రస్థుతం చలామణిలో ఉన్న కొవిడ్ అన్ని వేరియెంట్ల నివారణకు పనిచేస్తాయని అడ్వైజరీ ప్యానల్ డైరెక్టర్ మాండీ కోహెన్ చెప్పారు. (COVID boosters) వ్యాక్సినేషన్ ప్రజారోగ్యానికి కీలకమని,బూస్టరుతో కొవిడ్ పరిణామాల నుంచి నిరంతర రక్షణపొందాలని ఎఫ్‌డీఏ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పీటర్ మార్క్స్ సూచించారు.

Tigers Die : ఏడు రోజుల్లో 7 పులులు, 5 పులికూనల మృతి

కొవిడ్ -19, ఫ్లూ, ఆర్‌ఎస్‌వీలకు ఇప్పుడు వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉన్నాయని, అమెరికన్లందరూ ఈ కొత్త కొవిడ్ బూస్టర్లు వేయించుకోవాలని జో బిడెన్ కోరారు. బీఏ.4, బీఏ 5 ఒమైక్రాన్ సబ్ వేరియెంట్లను లక్ష్యంగా చేసుకొని కొవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ ను రూపొందించినట్లు అమెరికన్ వైద్యాధికారులు చెప్పారు. 5 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు మునుపటి టీకాతో సంబంధం లేకుండా చివరి కొవిడ్ డోస్ రెండు నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్యనిపుణులు సూచించారు.

IND vs SL : శ్రీలంక చిత్తు.. భారత్ ఘన విజయం

ఈ బూస్టర్ ప్రస్తుతం చలామణిలో ఉన్న వేరియంట్‌ల నుంచి అదనపు రక్షణను అందించగలదని వారు చెప్పారు. తీవ్రమైన వ్యాధులు,మరణాల నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెప్పారు. ఈ బూస్టర్ ముఖ్యంగా వృద్ధులు లేదా రోగనిరోధక శక్తి తగ్గిన వారికి ఉపయోగపడనుంది. అమెరికన్లు వారి వార్షిక ఫ్లూ షాట్ సమయంలోనే వ్యాక్సిన్‌ను స్వీకరించాలని ఫైజర్ యొక్క ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సూచించారు.

ట్రెండింగ్ వార్తలు