Tigers Die : ఏడు రోజుల్లో 7 పులులు, 5 పులికూనల మృతి

వివిధ రాష్ట్రాల్లో గత ఏడు రోజుల్లో ఐదు పిల్లలతో సహా ఏడు పులులు మరణించాయి. ఒక పులి దీర్ఘకాల అనారోగ్యంతో మరణించింది. పులి పిల్లలు తల్లి నుండి విడిపోయిన తర్వాత ఆకలితో మరణించాయి. ఈ ఘటనలపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....

Tigers Die : ఏడు రోజుల్లో 7 పులులు, 5 పులికూనల మృతి

Tiger Die

Tigers Die : వివిధ రాష్ట్రాల్లో గత ఏడు రోజుల్లో ఐదు పిల్లలతో సహా ఏడు పులులు మరణించాయి. ఒక పులి దీర్ఘకాల అనారోగ్యంతో మరణించింది. పులి పిల్లలు తల్లి నుండి విడిపోయిన తర్వాత ఆకలితో మరణించాయి. ఈ ఘటనలపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. (Seven tigers, including 5 cubs die)ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జూలో త్రిష అనే పులి అనారోగ్యంతో మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు. 2010లో కాన్పూర్ తీసుకొచ్చిన త్రిష జూలో 14 పిల్లలకు జన్మనిచ్చింది. గతేడాది డిసెంబరులో త్రిష పులి అస్వస్థతకు గురై జూలాజికల్ పార్కులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

IND vs SL : శ్రీలంక చిత్తు.. భారత్ ఘన విజయం

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లోని పొలంలో మంగళవారం మరో పులి చనిపోయింది. పులి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పులి వయసు రెండున్నరేళ్లు ఉంటుందని అంచనా. బల్లార్‌పూర్ అటవీ పరిధిలో రెండు పులి పిల్లలు చనిపోగా, ఒకటి మృత్యువాత పడే పరిస్థితిలో ఉండడంతో వెంటనే చికిత్స నిమిత్తం తరలించారు. దురదృష్టవశాత్తు అది కూడా మరణించింది. 5 నెలల వయస్సులో పులి పిల్లలు వేరు కావడంతో అవి ఆకలితో అలమటిస్తూ మరణించాయి.

AP Assembly Sessions: 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గత వారం రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో రెండు రోజుల వ్యవధిలో రెండు పులి పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. ఒక వైపు పులుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా, ఇలా పులులు తరచూ మరణిస్తుండటం వన్యప్రాణుల ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది గత 9 నెలల్లో మహారాష్ట్రలో 9 పులి పిల్లలు మరణించడం సంచలనం రేపింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పులుల మరణాల డేటాను వెల్లడించింది. 2022వ సంవత్సరంలో మొత్తం 28 పులులు చనిపోయాయి. తల్లి విడిచిపెట్టడం వల్ల ఆకలితో పులి పిల్లల మరణిస్తున్నాయి. ఇప్పుడు విద్యుదాఘాతం, వేట కూడా పులి పిల్లల మరణానికి ప్రధాన కారణాలని వన్యప్రాణుల సంరక్షణ అధికారులు చెప్పారు.