Donald Trump: కేసు కొట్టివేత.. డొనాల్డ్ ట్రంప్‌న‌కు భారీ ఊరట

2020 సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తరువాత శ్వేతసౌధం నుంచి కీలక పత్రాలను తరలించారన్న అభియోగంపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Donald Trump

Donald Trump: అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేకంటే ముందే ట్రంప్ నకు భారీ ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. అధ్యక్షపదవిలో ఉన్న వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయకూడదన్న అక్కడి న్యాయశాఖ నిబంధనల ప్రకారం న్యాయస్థానం కేసును కొట్టివేసింది.

Also Read: నట్టేట ముంచిన త్యాగం..! ఆ అణ్వాయుధాలే ఉంటే యుక్రెయిన్‌ మరోలా ఉండేదా? రష్యాకు చుక్కలు చూపించేదా?

2020 సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తరువాత శ్వేతసౌధం నుంచి కీలక పత్రాలను తరలించారన్న అభియోగంపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన కొన్ని కేసులను ఇటీవల కొట్టివేసిన న్యాయస్థానం, తాజాగా మరో కేసును కొట్టివేయాల్సిందిగా డొనాల్డ్ ట్రంప్ తరపు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంో న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ ఇందుకు అంగీకరించారు. అయితే, తాజా తీర్పు అధ్యక్ష పదవిలో ఉన్నంతవరకు మాత్రమేనని.. బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే తీర్పు గడువు ముగుస్తుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తిరిగి నాలుగేళ్ల తరువాత ఒకవేళ ట్రంప్ అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోతే మళ్లీ విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.

Also Read: Delhi Air Pollution : ఢిల్లీలోకి పర్మిషన్ లేని వాహనాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు సీరియస్..

2020 ఎన్నికల నాటి కేసు కొట్టివేయడంపై డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ కేసులు చట్టవిరుద్ధమైనవి. మాపై పోరాడేందుకు మా ప్రత్యర్థులైన డెమోక్రట్లు పన్ను చెల్లింపుదారులకు చెందిన 100 మిలియన్ డాలర్లు వృథా చేశారు. ఇంతకుముందు మన దేశంలో ఇటువంటివి జరగలేదని ట్రంప్ పేర్కొన్నారు.