నట్టేట ముంచిన త్యాగం..! ఆ అణ్వాయుధాలే ఉంటే యుక్రెయిన్ మరోలా ఉండేదా? రష్యాకు చుక్కలు చూపించేదా?
తమ జోలికి ఎవరైనా రావాలంటేనే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు రష్యా దెబ్బకు దిమ్మతిరిగిపోతోంది.

Russia Ukraine War : నమ్మి నట్టేట మునిగిపోయింది. నాడు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చినోళ్లు హ్యాండ్ ఇచ్చేశారు. ఆదుకోండి, అండగా నిలవండి అంటూ మోకరిల్లుతున్నా ఏ ఒక్క దేశం సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. త్యాగం చేసి తనకు తానుగా యుక్రెయిన్ తెచ్చుకున్న కష్టం ఏంటి? స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం, స్వయం పాలన కోసం, బానిస సంకెళ్లు తెంచుకోవడం కోసం సర్వం కోల్పోయింది యుక్రెయిన్.
సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినప్పుడు అణ్వాయుధాలను వదులుకుని ఇప్పుడు రష్యా నుంచి దండయాత్రను ఎదుర్కోంటోంది. మూడో అతిపెద్ద అణు శక్తిగా ఉన్న యుక్రెయిన్.. ఇప్పుడెందుకు సాయం కోసం అర్థిస్తోంది. స్వయం పాలన, దేశంగా ఏర్పడటం కోసం చేసిన త్యాగ ఫలితమే ఇప్పటి కష్టానికి, కన్నీళ్లకు కారణమా?
ఒకప్పుడు సూపర్ పవర్ కంట్రీ యుక్రెయిన్. తమ జోలికి ఎవరైనా రావాలంటేనే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు రష్యా దెబ్బకు దిమ్మతిరిగిపోతోంది. బతుకు జీవుడా అంటూ నిత్య నరకం అనుభవిస్తోంది. క్షణం ఒక యుగంలా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తోంది. ఒకవేళ బుడాపెస్ట్ ఒప్పందంలో భాగంగా యుక్రెయిన్ అణ్వస్త్రాలు వదులుకోక పోయుంటే ఇప్పుడు రష్యాకు చుక్కలు చూపించేదా? సాయం కోసం మోకరిల్లుతున్న యుక్రెయిన్ దగ్గరే పొరుగు దేశాలు ప్రాథేయపడే పరిస్థితి ఉండేదా? ఉక్రెయిన్ వదులుకున్నది ఏంటి. రష్యా అణ్వస్త్ర ప్రయోగంతో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమేనా?
పూర్తి వివరాలు..
Also Read : యుక్రెయిన్‌పై రష్యా మిసైల్ అటాక్.. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా?