Russia Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా మిసైల్‌ అటాక్.. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా?

యుక్రెయిన్ నే కాదు.. దానికి మద్దతుగా ఉన్న బ్రిటన్, అమెరికా సహా నాటో దేశాలన్నింటికి వరల్డ్ వార్ వార్నింగ్స్ ను పుతిన్ పంపినట్లైంది.

Russia Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా మిసైల్‌ అటాక్.. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా?

Updated On : November 25, 2024 / 11:45 PM IST

Russia Ukraine War : ఏది జరక్కూడదని అనుకుంటున్నారో అదే జరుగుతోంది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా? రష్యా యుక్రెయిన్ యుద్ధం భీకర రూపం దాల్చింది. దీంతో ఇవే అనుమానాలు ప్రపంచమంతా కలుగుతున్నాయి. దమ్ముంటే కాసుకో అన్నట్లు రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని మొదటిసారి ప్రయోగించింది. దానికి ధీటుగా యుక్రెయిన్ కూడా తొడగొట్టి తగ్గేదేలే అని స్ట్రామ్ షాడో క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారితీయడం ఖాయమన్న గట్టిగా బలపడుతున్నాయి.

తగ్గేదేలే అంటున్న యుక్రెయిన్.. అస్సలు వదిలేదే లేదంటున్న రష్యా.. ఓపక్క యుక్రెయిన్ పై గ్లైడ్ బాంబులను వదులుతున్న రష్యా.. మరోపక్క రష్యాపై విరుచుకుపడుతున్న యుక్రెయిన్ స్ట్రామ్ షాడో క్షిపణులు. పరిస్థితి చూస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా? అనేలా ఉంది. గత వారం 800 కేఏబీ శ్రేణికి చెందిన 1500 కేజీల బరువున్న గ్లైడ్ బాంబులతో యుక్రెయిన్ పై దాడికి దిగింది రష్యా. వందల కొద్ది గ్లైడ్ బాంబులను ప్రయోగిస్తోంది. అంతకుముందు రష్యా హైపర్ సోనిక్ మిసైల్ తో పాటు ఖండాంతర క్షిపణితో కూడా యుక్రెయిన్ నగరాలపై అటాక్స్ కొనసాగించింది. దీంతో యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది.

రష్యా యుక్రెయిన్ మధ్య వార్ వెయ్యి రోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. యుద్ధ తీవ్రత రోజురోజుకి పెరుగుతోందే కానీ టెన్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లు అణు యుద్ధం సంకేతాలు పుతిన్ పంపడం తర్వాత అణ్వాయుధ సామర్ధ్యాన్ని గుర్తు చేస్తూ సూపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం.. ఇదంతా చూస్తుంటే యుద్ధం మరో అంకానికి చేరినట్లే కనబడుతోంది. యుక్రెయిన్ కూడా అమెరికా, యూకే మద్దతుతో స్ట్రామ్ షాడో క్షిపణుల యుద్ధానికి తెరలేపింది. దీంతో ఇది మెల్లగా మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయన్న వాదనలకు మరింత బలం చేకూర్చుతోంది.

వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ వార్ లో రష్యా సూపర్ సోనిక్ క్షిపణిని ఉపయోగించడం ఇదే తొలిసారి. యుక్రెయిన్ మధ్య తూర్పు ప్రాంతంలోని డినిప్రో నగరంపై మిస్సైల్ అటాక్ చేసింది రష్యా. దీనికోసం అణ్వాయుధ యుద్ధానికి సంబంధించిన రూల్స్ ను కూడా రష్యా మార్చింది. అణ్వాయుధ ఒప్పందంపై పుతిన్ సంతకం చేసిన రెండు రోజుల తర్వాతే ఈ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం రష్యా తెగించిందనడానికి నిదర్శనం. దీంతో యుక్రెయిన్ నే కాదు.. దానికి మద్దతుగా ఉన్న బ్రిటన్, అమెరికా సహా నాటో దేశాలన్నింటికి వరల్డ్ వార్ వార్నింగ్స్ ను పుతిన్ పంపినట్లైంది.

 

Also Read : అసలేంటి బిట్ కాయిన్? ఇందులో పెట్టుబడులు పెట్టడం సేఫేనా?