Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’పై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఏమన్నారంటే..?

భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూ’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

Operation Sindoor

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ, ఎయిర్ పోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా మెరుపుదాడులు చేశాయి. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ దాడులు చేయగా.. 30మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు సమాచారం.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు..

భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూ’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘‘వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాలు రోడ్డుపైకొచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. భారత్, పాకిస్థాన్ కు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే, ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు’’ అని అన్నారు.