అయ్యో పాపం.. 4వేలు విరాళం ఇచ్చినందుకు పన్నెండేళ్లు జైలు శిక్ష.. రష్యా దుర్మార్గపు చర్య

ఓ స్వచ్ఛంద సంస్థకు సుమారు రూ.4,200 విరాళం ఇచ్చినందుకు రష్యాలోని ఓ మహిళకు అక్కడి కోర్టు 12ఏళ్లు జైలు శిక్ష విధించింది.

Ksenia Khavana

Ksenia Khavana sentenced to 12 years : రష్యాకు చెందిన సేనియా ఖవానా ఓ డ్యాన్సర్. ఆమెకు ప్రస్తుతం 33ఏళ్లు. కొద్దికాలం క్రితం అమెరికా వ్యక్తిని వివాహం చేసుకుంది. భర్తతో కలిసి లాస్ ఏంజెలెస్ లో స్థిరపడింది. తన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యాలోని తన స్వస్థలానికి సేనియా ఖావానా వచ్చింది. అయితే, రష్యా అధికారులు ఆమెను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చారు. పలు దఫాలుగా విచారణ అనంతరం ఇటీవల ఆమెకు కోర్టు 12ఏళ్లు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమె కటకటాల్లో ఉంది. ఆమె చేసిన తప్పేంటో తెలుసా.. కేవలం 51 డాలర్లు (సుమారు రూ.4200) విరాళం ఇవ్వడమే. ఆమె లాస్ ఏంజెలెస్ లో ఉన్న సమయంలో అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థకోసం ఆ విరాళాన్ని అందజేసింది. విరాళం ఇచ్చినందుకే అరెస్ట్ చేయడం ఏమిటని మీకు డౌట్ రావొచ్చు.. పూర్తి వివరాలు పరిశీలిస్తే..

Also Read : తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు

రష్యా, ఉక్రెయిన్ మధ్య గత రెండేళ్లుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కొనసాగిస్తుంది. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా ఉక్రెయిన్ లో లక్షలాది మంది ప్రజలు, సైనికులు మరణించారు. రష్యా తీరును ఖండిస్తున్న పలు దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. విరాళాలు అందజేస్తున్నారు. అమెరికా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలస్తూ వస్తోంది. ఆయుధాలను పెద్దెత్తున సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్ కు అండగా నిలిచేందుకు అమెరికాలోని ఓ స్వచ్చంద సంస్థ విరాలాలు సేకరిస్తుంది. వచ్చిన మొత్తాన్ని ఉక్రెయిన్ లో ప్రజలు అందజేస్తుంది. అయితే, లాస్ ఏంజెలెస్ లో స్థిరపడిన సేనియా ఖవానా ఆ స్వచ్ఛంద సంస్థకు 51 డాలర్లు (సుమారు రూ. 4,200) ఇచ్చింది. ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చినందుకు రష్యా అధికారులు ఆమెను అరెస్టు చేశారు.

Also Read : రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

ఈ ఏడాది ఫ్రిబరి నెలలో సేనియా ఖవానా ను రష్యా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ఆ తరువాత కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో.. నేను ఇచ్చిన విరాళాన్ని ఉక్రెయిన్ లో రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తారని తెలియదని సేనియా ఖవానా కోర్టుకు తెలిపింది. అయితే, రష్యా కోర్టు మాత్రం దేశ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడిందని భావిస్తూ ఆమెకు 12ఏళ్లు జైలు శిక్ష విధించింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు