తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు

తైవాన్ ను భారీ భూకంపం వణికించింది. తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలో మీటర్లు దూరంలో భారత కాలమానం ప్రకారం

తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు

Taiwan Earthquake (File Phoho)

Updated On : August 16, 2024 / 7:11 AM IST

Taiwan Earthquake : తైవాన్ ను భారీ భూకంపం వణికించింది. తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలో మీటర్లు (21.13 మైళ్లు) దూరంలో శుక్రవారం తెల్లవారు జామున 6.3తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. భూకంపం 9.7కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా భవనాలు ఊగడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే.. 24గంటల వ్యవధిలో ఇది అక్కడ సంభవించిన రెండో భూకంపం.

Also Read : KTR Comments : మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సీరియస్.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు!

తైవాన్ లో భూకంపాల తరచుగా సంభవిస్తుంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సంభవించిన భూకంపం కారణంగా 17మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అప్పుడు తొమ్మిది నిమిషాల వ్యవధిలో ఐదుసార్లు భూప్రకంపలు చోటుచేసుకున్నాయి. దీంతో పలు భవనాలు నేలమట్టం అయ్యారు.