ఒబామాను కాపాడిన కుక్కకు ఘన సన్మానం

  • Published By: veegamteam ,Published On : August 30, 2019 / 09:31 AM IST
ఒబామాను కాపాడిన కుక్కకు ఘన సన్మానం

Updated On : August 30, 2019 / 9:31 AM IST

వైట్‌హౌస్‌..అమెరికా అధ్యక్షుని నివాసం. శతృదుర్భేధ్యం. 2014లో వైట్ హౌస్ లోకి మారణాయుధాలతో ప్రవేశించాడు ఓ దుండగుడు. అప్పుటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామాని చంపాలనేది అతని టార్గెట్.  వైట్‌హౌస్‌ ఫెన్స్ దూకి లోపలికి ఆయుధాలతో  ప్రవేశించాడు.అప్పుడే విరుచుకుపడింది అతనిపై ఓ జాగిలం. అది అలాంటి ఇలాంటి జాగిలం కాదు..దాని కంట్లో పడ్డ శతృవు తప్పించుకోలేడు.బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన జాగిలం అది. వెరీ పవర్ ఫుల్. దాని పేరు హరికేన్. పేరుకు తగ్గట్లే తుఫాన్  వేగం దానిది. 

 వైట్‌హౌస్‌ ఫెన్స్ దూకి లోపలికి ప్రవేశించిన సదరు దుండగుడిని పసిగట్టింది. అతనిపై సింహంలా విరుచుకుపడింది. చెలరేగిపోయిది. అడుగు వేస్తే కండల్ని చీల్చి చెండాడేస్తుంది. పట్టుబడితే ప్రాణం పోవటం ఖామని తెలిసిన సదరు దుండగుడు హరికేన్ పై పోరాటం అతనివల్ల కాలేదు. వెల్లకిల్లా పడిపోయాడు. అతన్ని నోట కరచుకుని పట్టుకుని  బరబరా ఈడ్చుకుపోయింది. హరికేన్ అరుపులతో అలర్ట్ అయిన ఆ దిశగా వస్తున్న వైట్ హౌస్ సెక్యూరిటీ అధికారుల ముందు పడేసింది. 

వెంటనే ఆ దుండగుణ్ని సెక్యూరిటీ అధికారుల అరెస్టు చేశారు. అప్పటివరకూ అతనితో కుక్క పోరాడిన విధానాన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో చూసి…దాని ధైర్యసాహసాల్ని మెచ్చుకున్నారు. ఆశ్చర్యపోయారు. కాగా ఆ దుండగుడు వచ్చిన సమయంలో…వైట్ హౌస్‌లోనే ఉన్న ఒబామా ఛాయలకు కూడా పోనీయలేదు హరికేన్. 

దుండగుడి దాడిలో హరికేన్ కు గాయాలవ్వటంతో చికిత్స చేయించారు. ఆ తరువాత రెండేళ్లకు అంటే 2016లో అమెరికా సీక్రెట్ సర్వీస్ నుంచీ హరికేన్ రిటైరైంది. ఒబామాను కాపాడిన ఆ జాగిలానికి ఇప్పుడు బ్రిటన్‌లోని వెటెరినరీ చారిటీ సంస్థ PSDA…ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ప్రకటించింది. 2019 అక్టోబర్‌లో… లండన్‌లో ప్రత్యేక సెరెమనీ నిర్వహించి… హరికేన్ సన్మానం చేయబోతున్నారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు అంటే “ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్‌” అవార్డుకి సమానమైనది.