US Sends USS Eisenhower : ఇజ్రాయెల్‌ యుద్ధరంగంలోకి మరో అమెరికా విమాన వాహక నౌక

ఇజ్రాయెల్ యుద్ధరంగంలోకి మరో అమెరికా యుద్ధ వాహక నౌక దిగింది. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశానికి యూఎస్ రెండవ విమాన వాహక నౌక ఐసెన్‌హోవర్ ను అమెరికా తాజాగా పంపించింది.....

USS Eisenhower

US Sends USS Eisenhower : ఇజ్రాయెల్ యుద్ధరంగంలోకి మరో అమెరికా యుద్ధ వాహక నౌక దిగింది. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశానికి యూఎస్ రెండవ విమాన వాహక నౌక ఐసెన్‌హోవర్ ను అమెరికా తాజాగా పంపించింది. ఇజ్రాయెల్ దేశానికి యుద్ధ నౌకతోపాటు అత్యంత అధునాతన ఆయుధాలను అమెరికా పంపించింది. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ యుధ్ధాన్ని విస్తృతం చేసేందుకు అమెరికా రెండో విమాన వాహక నౌక స్ట్రైక్ గ్రూప్ ను తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి పంపిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ శనివారం తెలిపారు.

Also Read : Shehla Rashid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మోదీ, అమిత్ షాలపై షేలా రషీద్ ప్రశంసలు

యూఎస్ఎస్ ఐసెన్‌హోవర్, దాని అనుబంధ యుద్ధనౌకలు ఇజ్రాయెల్ దేశానికి వచ్చాయి. హమాస్ ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేసేందుకు తాము మరో యుద్ధనౌక, ఆయుధాలను పంపినట్లు లాయిడ్ ఆస్టిన్ ఒక ప్రకటనలో తెలిపారు. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ దాడి చేసి 1300మందిని కాల్చి చంపింది. గాజాలో 2,200 మంది మరణించారని ఆరోగ్య అధికారులు చెప్పారు.

Also Read :Telangana : ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత

రెండవ యుద్ధ నౌకను పంపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ కాల్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్ ముట్టడి, గాజాపై బాంబు దాడుల మధ్య పౌరులను రక్షించాలని యూఎస్ కోరింది. గాజాలో పౌరులను రక్షించే ప్రయత్నాలకు తాను మద్ధతు ఇస్తానని బిడెన్ చెప్పారు. ఇజ్రాయెల్‌పై హమాస్ క్రూరమైన దాడిని ఖండిస్తూ శత్రుత్వం చెలరేగిన తర్వాత మొదటిసారిగా బిడెన్ శనివారం పాలస్తీనా అథారిటీ నాయకుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడారు.

Also Read :Arun Kumar : మోదీ, జగన్ కలిసే ఆ పని చేస్తున్నారు : అరుణ్ కుమార్