Irresponsible Space : చెత్త వివాదం..అమెరికా – రష్యా స్పేస్ వార్

అంతరిక్షంలోనూ అమెరికా, రష్యాల మధ్య అలజడి మొదలైంది. ర‌ష్యా చేప‌ట్టిన యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్‌ ఇరుదేశాల మధ్య రచ్చకు దారి తీసింది.

Space

US Slams Russia : అంతరిక్షంలోనూ అమెరికా, రష్యాల మధ్య అలజడి మొదలైంది. ర‌ష్యా చేప‌ట్టిన యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్‌ ఇరుదేశాల మధ్య రచ్చకు దారి తీసింది. ప‌నికిమాలిన ప్రయోగాలతో స్పేస్‌లో చెత్త పేరుకుపోతుందంటూ రష్యాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది అమెరికా. రష్యా చర్య పూర్తిగా బాధ్యతారాహిత్యమైనదని ఆగ్రహం వ్యక్తం చేసింది. శాటిలైట్‌ను పేల్చివేయడంతో 15 వందల శకలాలతో స్పేస్ జంక్ ఏర్పడిందని అమెరికా మండిపడింది.

Read More : J&K Terrorists : దెబ్బకొట్టారు..తిప్పికొట్టారు, ఐదుగురు ఉగ్రవాదుల హతం

అంతేకాక వేల సంఖ్యలో చిన్నచిన్న శకలాలు తిరుగుతున్నాయని, వీటి వల్ల అన్ని దేశాలతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో నలుగురు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు, ఒక జర్మన్ ఉన్నారు. రష్యా చర్యల వల్ల వారికి తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. స్పేస్ జంక్‌.. సైంటిస్టులను కలవరపెట్టిస్తోంది.  అంతరిక్షంలో విచ్ఛిన్నమైన శిథిలాల కారణంగా పనిచేస్తున్న ఉపగ్రహాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది. అంతరిక్షంలో ఏర్పడే ఈ శిథిలాల ఘర్షణకు రష్యా కారణమని అమెరికా ఆరోపిస్తోంది.

Read More : CBI Raids : తిరుపతిలో ఛైల్డ్ పోర్న్ వీడియోలతో వ్యాపారం, సీబీఐ దాడులు

అయితే తాము గ్రీన్‌ జోన్‌లోనే పరీక్ష చేసినట్లు రష్యా వాదిస్తోంది. ఇలా పోటాపోటిగా ఇరుదేశాలు వాదన చేసుకోవడంపై ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది స్పేస్ వార్‌కు దారితీస్తుందేమోనని భయపడుతున్నాయి. రష్యన్ యాంటీ శాటిలైట్ క్షిపణి పరీక్ష కారణంగా అంతరిక్షంలో తిరుగుతున్న శిథిలాలను ట్రాక్ చేయడం కష్టంగా మారింది. శాటిలైట్‌ను పేల్చడంతో వెలువడిన రాతి, ధూళి కణాలు, పెయింట్ చిప్స్ లాంటివి ట్రాక్ చేయడానికి వీలు కావడంలేదు. దీని కారణంగా అంతరిక్షంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఉపగ్రహ శకలాలు ప్రతి 93 నిమిషాలకు ఒకసారి ISSను దాటుతున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.