Los Angeles: వామ్మో.. ప్యాంటులో 60 పాములతో పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తి.. వాటిని ఎటు తీసుకెళ్తున్నాడంటే..
ప్యాంటు జేబుల్లో 60 పాములు, బల్లులను తరలిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. వీటి విలువ సుమారు 750,000 డాలర్లు ఉంటుంది. అయితే వీటిలో మూడు పాములు చనిపోయినట్లు లాస్ ఏంజెల్స్ పోలీసులు గుర్తించారు.

Snakes, Lizards
Los Angeles: మనం పాములు, బల్లులు అంటేనే దగ్గరకు వెళ్లడానికి భయపడతాం. కొన్ని రకాల పాములు వస్తున్నాయంటేనే అవి ఎక్కడ కాటేస్తాయోనన్న భయంతో దూరం పరుగెడతాం. కానీ ఓ వ్యక్తి 60 పాములు, బల్లులను ఏకంగా ప్యాంటు జేబులో వేసుకొని, నడుంకు కట్టుకొని ఎవరూ గుర్తించకుండా ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నాడు. అయితే లాస్ ఏంజెల్స్ పోలీసులు అతని అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు.
ప్యాంటు జేబుల్లో 60 పాములు, బల్లులను తరలిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. వీటి విలువ సుమారు 750,000 డాలర్లు ఉంటుంది. అయితే వీటిలో మూడు పాములు చనిపోయినట్లు లాస్ ఏంజెల్స్ పోలీసులు గుర్తించారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ దీనికి సూత్రధారి. అతను ఇప్పటి వరకు మెక్సికో, హాంకాంగ్ నుంచి యునైటెడ్ స్టేట్స్ లోకి 1,700 జంతువులను తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇతడు చేసిన నేరానికి దశాబ్దాలపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. యూస్ స్మగ్లర్.. యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులతో పాటు పలురకాల సరీసృపాలను దేశవ్యాప్తంగా విక్రయించినట్లు, వాటి విలువ సుమారు 739,000 డాలర్ల కంటే ఎక్కువ ఉంటుందని స్మగ్లర్ వద్ద లభించిన పత్రాల ద్వారా లాస్ ఏంజెల్స్ పోలీసులు గుర్తించారు.
Viral Video : కలెక్టర్ కళ్లద్దాలు ఎత్తుకెళ్లిన కోతి..లంచం తీసుకుని తిరిగి ఇచ్చింది
ఈ యేడాది మార్చి నెలలో అతను మెక్సికో నుంచి పాములు, బల్లులు, ఇతర సరీసృహాలను తరలించే క్రమంలో వాటిలో కొన్నింటిని నడుముకు చుట్టుకోవటం, కొన్నింటిని అతని ప్యాంటు జేబుల్లో ఇలా మొత్తం 60 జీవులను రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. అతని వద్ద రంగును మార్చే ఒక రకమైన పాము ఉంది. అయితే దాని కళ్ల నుంచి రక్తస్రావం కూడా అయింది. ఈ 60 పాములు, బల్లులు, ఇతర సరీసృపాల్లో మూడు సరీసృపాలు చనిపోయాయి.