Viral Video: బీచ్‌లో బికినీలతో అందగత్తెలు సందడి చేస్తుంటే.. చీరకట్టులో మహిళ ఎంట్రీ.. కళ్లన్నీ అటువైపే
బీచ్‌లో బికినీలు వేసుకొని సందడి చేసే అందగత్తెల మధ్య చీరకట్టులో ఓ మహిళ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ భారతీయ చీరకట్టులో బికినీలతో సందడిచేసే మహిళల మధ్య ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది..

woman in beach
Viral Video: భారతీయ సంస్కృతిని ప్రతిభింభించే చీరకట్టుతో ఎక్కడ ఉన్నా ప్రత్యేక గౌరవం లభిస్తుంది. విదేశాల్లోసైతం భారతీయ మహిళలు ఎక్కువగా చీరకట్టుతో ఫంక్షన్లు, ఇతర శుభాకార్యాలు, ఏదైనా కార్యక్రమాల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ, మీరు బీచ్‌లలో బికినీలు వేసుకొని సందడి చేసే అందగత్తెల మధ్య చీరకట్టులో ఓ మహిళ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ భారతీయ చీరకట్టులో బికినీలతో సందడిచేసే మహిళల మధ్య ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది.. అందరి కళ్లు ఆ మహిళ వైపే..
Crocodile Angry: వామ్మో.. మొసలికి కోపమొచ్చింది.. వ్యక్తిని ఎలా ఉరికించిందో చూడండి.. వీడియో వైరల్
ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో.. ఓ మహిళ చీరకట్టులో బీచ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. విదేశీ మహిళలు బీచ్ లో బికినీలతో సందడి చేస్తున్నారు. బీచ్ ఒడ్డున ఈతకొడుతూ సేద తీరుతున్నారు. కొందరు బీచ్ ప్రాంతంలో ఉండే బండరాళ్లపై అటూఇటూ బికినీల్లో తిరుగుతున్నారు. ఇంతలో ఓ మహిళ చీరకట్టులో ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది బికినీలు వేసుకున్న విదేశీ మహిళలతో పాటు ఆ బీచ్ లోని అందరి కళ్లు ఆమెవైపే తిరిగాయి. అంతమంది బికీనీ మహిళల మధ్యలో చీరకట్టులో ఉన్న మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
अरे काकी कहां पहुंच गई ?? pic.twitter.com/tQkIsGRuWD
— Rishika gurjar (@Rishikagurjjar) August 22, 2022
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను 99వేల మందికిపైగా వీక్షించారు. ట్విటర్‌లో ఈ వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. విదేశాల్లోని పలు ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతికి తగినట్లుగా దుస్తులు ధరించడం వంటి ఒత్తిడికి మహిళ లొంగిపోలేదని పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.