Afgan
US-Afghanistan: తాలిబన్ల హస్తగతం అనంతరం అఫ్గానిస్తాన్ లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా బలగాలు అఫ్గాన్ గడ్డ నుంచి ఎగిరిపోయిన క్షణం నుంచి తాలిబన్ల చేతిలో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ లో ఆకలి కేకలు, ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో అఫ్గాన్ ప్రజలను ఆదుకొనేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది. యూఎస్ లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ ఆస్తులను, నిధులను విడుదల చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో అమెరికాలోని వివిధ ఆర్ధిక సంస్థల వద్ద చిక్కుకున్న $7 బిలియన్ డాలర్ల అఫ్గానిస్తాన్ నిధులు అఫ్గాన్ ప్రజలకు, 26/11 ఉగ్ర బాధితులకు చేరనున్నాయి.
Also read: Covid Rules Easing: కరోనా అదుపులోకి రావడంతో ఆంక్షలు సడలిస్తున్న రాష్ట్రాలు
అల్ ఖైదా ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ కు విముక్తి కలిగిస్తూ..దేశంలో ప్రజాస్వామ్య పాలన ఏర్పాటయ్యేలా అమెరికా తన సైనిక బలగాలను అఫ్గానిస్తాన్ లో మోహరింపజేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు అమెరికా సేనలు అఫ్గానిస్తాన్ ను కాపాడాయి. అయితే గతేడాది చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో తాలిబన్లు అఫ్గానిస్తాన్ ను చేజిక్కించుకున్నారు. కాగా అమెరికా సహకారంతో అఫ్గానిస్తాన్ దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అఫ్గాన్ దేశపు ఆస్తులను, అఫ్గాన్ సెంట్రల్ బ్యాంకు నిధులను హామీగా స్వీకరిస్తూ.. అమెరికా అఫ్గానిస్తాన్ కు సహాయం చేసింది. మొత్తంగా $7 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆ సంపదనను.. అఫ్గాన్ ప్రజల భవిష్యత్తు కోసం, ఉగ్రవాద బాధితుల కోసం ఉపయోగించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.
Also read: Lata Mangeshkar: అయోధ్యలో ఒక కూడలికి “లతా మంగేష్కర్” పేరు: యోగికి మోదీ ప్రశంస
ఈమేరకు ప్రెసిడెంట్ జో బైడెన్ నిధుల విడుదలకు సంతకం చేశారు. ఈ నిర్ణయంతో $3.5 బిలియన్ డాలర్ల నిధులు అఫ్గాన్ ప్రజల కోసం ఖర్చు చేయనుండగా, మిగతా నిధులను 26/11 ఉగ్రదాడుల్లో నష్టపోయిన బాధితులకు ఇతర ఉగ్రవాద బాధితులకు అందించనున్నారు. అమెరికాలోని అఫ్గానిస్తాన్ సెంట్రల్ బ్యాంకుకు చెందిన ఈ ఆస్తులు..ప్రస్తుతం వివిధ ఆర్ధిక సంస్థల వద్దనున్నాయి. ఆయా సంస్థల వారు ఆ ఆస్తులను, నిధులను ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో ఉన్న ఏకీకృత అకౌంట్ కు బదిలీ చేస్తారు. అనంతరం ఆ నిధులు తాలిబన్ల చేతికి చిక్కకుండా నేరుగా అఫ్గాన్ ప్రజల సంక్షేమానికి ఉపయోగించేలా బహుళ దశ వ్యూహాలను అమెరికా అధికారులు సిద్ధం చేశారు.
Also read: No Vaccine: వాక్సిన్ కు వ్యతిరేకంగా ఇతర దేశాల్లోనూ కెనడా తరహా “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలు