No Vaccine: వాక్సిన్ కు వ్యతిరేకంగా ఇతర దేశాల్లోనూ కెనడా తరహా “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలు

"వాక్సిన్ తప్పనిసరి" వద్దంటూ కెనడా దేశంలో మొదలైన నిరసనలు క్రమంగా ఇతర దేశాలకు పాకుతున్నాయి. మరికొన్ని దేశాల్లో వాక్సిన్ కు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలకు దిగుతున్నారు

No Vaccine: వాక్సిన్ కు వ్యతిరేకంగా ఇతర దేశాల్లోనూ కెనడా తరహా “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలు

Freedom

No Vaccine: “వాక్సిన్ తప్పనిసరి” వద్దంటూ కెనడా దేశంలో మొదలైన నిరసనలు క్రమంగా ఇతర దేశాలకు పాకుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా సహా యూరోప్ ఖండంలోని మరికొన్ని దేశాల్లో వాక్సిన్ కు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలకు దిగుతున్నారు. అమెరికా కెనడా దేశాల మధ్య సరిహద్దులు ధాటి వచ్చే లారీ డ్రైవర్లు, ఇతర వాహనదారులు, వలస కార్మికులకు “వాక్సిన్ మ్యాండేట్” వద్దంటూ కెనడా దేశ వ్యాప్తంగా జనవరి మూడో వారంలో ప్రారంభమైన నిరసనలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. “ఫ్రీడమ్ కాన్వాయ్” పేరుతో కెనడా దేశంలోని ట్రక్ డ్రైవర్లు, ఇతర వాహనదారులు, వలస కార్మికులు వాక్సిన్ పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. నిరసనలు హింసాత్మకంగా మారి ఆందోళనకారులు కెనడా ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా.. ఆదేశ ప్రధాని జస్టిన్ ట్రూడ్యూ కుటుంబంతో సహా రహస్య ప్రాంతానికి వెళిపోయారు.

Also read: Rajasthan Police: నకిలీ వార్తల కట్టడిపై రాజస్థాన్ పోలీసుల వినూత్న ప్రచారం

ఇదిలా ఉంటే..కరోనా వాక్సిన్ తప్పనిసరి, మాస్క్ ధరించడం, ఇతర కరోనా నిబంధనలు కొనసాగించడంపై ఇతర దేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సైప్రస్, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా మరియు అమెరికా దేశాల్లో ట్రక్ డ్రైవర్లు నిరసనలకు దిగారు. కెనడా ట్రక్ డ్రైవర్లకు సంఘీభావం తెలుపుతూ.. వాక్సిన్ కు వ్యతిరేకంగా తమ తమ దేశాల్లోనూ భారీ ఆందోళనలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా నిరసనలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు ట్రక్ డ్రైవర్లు, ఇతర ప్రజాసంఘాలు ప్రణాళికలు వేసుకున్నారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Also read: Rahul Gandhi: మోదీ “గోవా విమోచన” వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్

న్యూ జీలాండ్ లో పార్లమెంట్ ముట్టడికి యత్నించిన ట్రక్ డ్రైవర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఘటనలు హింసాత్మకంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. బెల్జియంలోనూ..”ఫ్రీడమ్ కాన్వాయ్” తరహా నిరసనలు తలెత్తడంపై పోలీసులు అప్రమత్తమై.. ముందు జాగ్రత్త చర్యగా.. దేశ రాజధానిలో ఆంక్షలు విధించారు. ఇక ఫ్రాన్స్ దేశంలో ప్రభుత్వం విధించిన కోవిడ్ రూల్స్ కి వ్యతిరేకంగా గత రెండు రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనకారులు ప్యారిస్ నగరంలోకి వచ్చే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్యారిస్ నగరాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న పోలీసులు, నగరంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఆస్ట్రియా, అమెరికా దేశాల్లోనూ కరోనా రూల్స్ కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Also read: China Fishing Vessels: హిందూమహా సముద్రంలో అక్రమంగా చైనా చేపల వేట