China Fishing Vessels: హిందూమహా సముద్రంలో అక్రమంగా చైనా చేపల వేట

ఆంతర్జాతీయ చేపల పరిశ్రమలో ఇటీవల చైనా స్తానం, గణాంకాలు అమాంతంగా పెరుగుతుండడంపై అనుమానం వ్యక్తం అవుతుండగా..ప్రస్తుత నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది.

China Fishing Vessels: హిందూమహా సముద్రంలో అక్రమంగా చైనా చేపల వేట

China

China Fishing Vessels: హిందూ మహా సముద్రంలో చైనా దురాక్రమణలు పెరిగిపోతున్నాయి. భారత జలాల వెంబడి..చైనా చట్టవిరుద్ధంగా చేపల వేట కోనసాగిస్తుందంటూ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ (IFC-IOR) ప్రకటించింది. చట్టవిరుద్ధమైన, నియంత్రణ లేనివిధంగా(IUU) వ్యవహరిస్తూ చైనా చేపల వేటను సాగిస్తుందని IFC-IOR నివేదిక వెల్లడించింది. భారత నేవీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న IFC-IOR..దేశవిదేశాల్లో ఉన్న 50కి పైగా సముద్ర రక్షణ కేంద్రాలతో సంబంధాలు కలిగిఉంది. ఇటీవల IFC-IOR తెలిపిన వివరాలు మేరకు.. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా అనేక సార్లు అతిక్రమణలకు పాల్పడి..చేపల వేట కొనసాగిస్తుంది. 2020 నుంచి ఇప్పటివరకు మొత్తం 379 సార్లు చైనా అతిక్రమణలకు పాల్పడగా.. అందులో 2021 సంవత్సరం మొదటి ఆరునెలల్లోనే 213 అతిక్రమణలు ఉన్నట్లు IFC-IOR పేర్కొంది.

Also read: Honda CBR150R: మరోసారి భారత మార్కెట్లోకి CBR150R బైక్ ను తెస్తున్న హోండా

ఆంతర్జాతీయ చేపల పరిశ్రమలో ఇటీవల చైనా స్తానం, గణాంకాలు అమాంతంగా పెరుగుతుండడంపై అనుమానం వ్యక్తం అవుతుండగా..ప్రస్తుత నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది. శాటిలైట్ డేటా ఆధారంగా తాజా అంచనా ప్రకారం, సుదూర సముద్ర జలాల్లో చేపల వేట (DWF) సాగించే దాదాపు 17000 ఓడలు(Fleet) చైనా దేశంలో రిజిస్టర్ చేయబడ్డాయి. మరో 1,000 నౌకలు వివిధ సౌకర్యాల పేరిట నమోదు చేయబడ్డాయి. సంఖ్యా పరంగా చెప్పాలంటే.. అమెరికా(USA) దేశం మొత్తం మీద 225 డిస్టెన్స్ వాటర్ ఫిషింగ్ వెస్సెల్స్ (DWF) ఓడలు ఉంటే.. యూరోపియన్ యూనియన్ మొత్తం మీద 289 DWF వెస్సెల్స్ ఉన్నాయి. ఈసంఖ్యతో పోలిస్తే.. చైనా వద్దనున్న DWF సంఖ్య వందల రేట్లు అధికం.

Also read: Pawan Kalyan: ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే “సలహాదారు పోస్టులు” ఇచ్చుకోవడం కాదు: పవన్

శక్తివంతమైన ఇంజన్లు మరియు అధునాతన శీతలీకరణ యూనిట్లతో చాలా భారీగా నిర్మించబడ్డ ఈ DWF వెస్సెల్స్ తయారీ కోసం చైనా ప్రభుత్వమే మత్య్సకారులకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోని ఫిషింగ్ ఓడల్లో చైనా అత్యధిక వాటాను కలిగి ఉంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో జీవజాలం క్షీణించడంతో, ఈ ఓడలు హిందూ మహాసముద్రం మరియు ఆఫ్రికన్ తీరప్రాంతం సహా ఇతర ప్రాంతాలకు వెళ్లి చేపలు పట్టి చైనాకు తరలిస్తున్నాయి. ఆఫ్రికాలోని సియెరా లియోన్ దేశపు సముద్ర తీరంలో చేపలు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించిన చైనా.. అక్కడకు ఈ భారీ ఓడలను తరలించి చట్ట విరుద్ధంగా చేపల వేట కొనసాగిస్తుంది. స్థానిక మత్స్యకారుల వద్ద అధునాతన పడవలు లేకపోవడం, ప్రభుత్వ పెద్దలను లొంగదీసుకుని చైనా ఈ తరహా పెత్తనాలు చెలాయిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పాకిస్తాన్ సముద్ర తీరంలోనూ చైనా ఓడలు చేపలు పడుతుండడంపై పాక్ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read: Pawan Kalyan: ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే “సలహాదారు పోస్టులు” ఇచ్చుకోవడం కాదు: పవన్