Rahul Gandhi: మోదీ “గోవా విమోచన” వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్

మోదీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ..వాతావరణ, ఉద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ నెహ్రు ప్రస్తావన చేసారని రాహుల్ విమర్శించారు.

Rahul Gandhi: మోదీ “గోవా విమోచన” వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్

Modhi

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పై ఫైర్ అయ్యారు. గోవా విమోచనానికి సంబంధించి.. రాహుల్ తాత, దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చర్యలపై.. ప్రధాని మోదీ గురువారం గోవాలో సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈక్రమంలో మోదీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ..వాతావరణ, ఉద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ నెహ్రు ప్రస్తావన చేసారని రాహుల్ విమర్శించారు. ఫిబ్రవరి 14న గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. శుక్రవారం గోవాలో పర్యటించిన రాహుల్ గాంధీ భహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధాని మోదీకి అప్పటి పరిస్థితులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏం జరుగుతుందో మోదీకి తెలుసా అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

Also read: China Fishing Vessels: హిందూమహా సముద్రంలో అక్రమంగా చైనా చేపల వేట

గురువారం గోవాలో పర్యటించిన ప్రధాని మోదీ..గోవా విమోచనం గురించి మాట్లాడారు. నాటి ప్రధాని నెహ్రు అలసత్వం కారణంగానే గోవా 15 ఏళ్ల తరువాత భారత్ లో అంతర్భాగమైందని.. నెహ్రు తలుచుకుని ఉంటే 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజునే గోవాకు పోర్చుగీసు వారి నుంచి విముక్తి లభించేదని మోదీ అన్నారు. గతంలో ఏళ్ల పాటు గోవాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అవినీతిలో కూరుకుపోయి, మైనింగ్ లో అక్రమాలకు పాల్పడిందని మోదీ అన్నారు. గోవాను అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలే దగ్గరుండి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు.

Also read: Honda CBR150R: మరోసారి భారత మార్కెట్లోకి CBR150R బైక్ ను తెస్తున్న హోండా

ఇక మోదీ వ్యాఖ్యలపై శుక్రవారం రాహుల్ గాంధీ స్పందిస్తూ.. గోవాలో సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రధాని ఇక్కడికి వస్తుంటారని అన్నారు. పోర్చుగీసు అధీనంలో ఉన్న గోవాను 15 ఏళ్ల తరువాత భారత్ లో కలపడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని, వాటి గురించి తెలియకుండా ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. గోవాలో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీని కైవసం చేసుకుని.. ఎవరి పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేసారు.

Also read: Pawan Kalyan: ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే “సలహాదారు పోస్టులు” ఇచ్చుకోవడం కాదు: పవన్