Pornography Class : యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు ప్రకటించిన కాలేజ్

అమెరికాలోని ఒక కాలేజీ పోర్నోగ్రఫీలో  కోర్సును ప్రవేశ పెట్టింది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ మే 3వ తేదీ నుంచి జూన్ 4వ తేదీవరకు స్వల్ప వ్యవధి కల క్లాసులు ఉంటాయని తన వెబ్ సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. 

Pornography Class :  అమెరికాలోని ఒక కాలేజీ పోర్నోగ్రఫీలో  కోర్సును ప్రవేశ పెట్టింది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ మే 3వ తేదీ నుంచి జూన్ 4వ తేదీవరకు స్వల్ప వ్యవధి కల క్లాసులు ఉంటాయని తన వెబ్ సైట్‌లో ప్రకటన విడుదల చేసింది.

సాల్ట్ లేక్   సిటీలోని వెస్ట్ మినిస్టర్ కాలేజీ ప్రతి ఏటా విద్యార్ధులకు స్వల్పకాలిక కోర్సులను అందిస్తూ ఉంటుంది. ఈ ఏడాది లైంగిక విజ్ఞానం పెంపొందించటానికి పోర్నోగ్రఫీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. వెస్ట్‌మిన్‌స్టర్ సాల్ట్ లేక్ సిటీలోని ఒక ప్రైవేట్, లాభాపేక్షలేని, గుర్తింపు పొందిన,  లిబరల్ ఆర్ట్స్ కళాశాల . ఈ వారం ప్రారంభంలో టాక్ షో హోస్ట్, పొలిటికల్ వ్యాఖ్యాత తన ట్విట్టర్ ఖాతాలో ఈకోర్సు గురించి కామెంట్ చేసినప్పటినుంచి కొన్ని మిలియన్ల మందికి ఈవిషయం తెలిసింది.

సామాజిక అంశాలను విశ్లేషించేందుకు, వివాదాస్పద అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇది ఒక అవకాశమని  కాలేజ్  తెలిపింది. అయితే, విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతిలో అశ్లీల చిత్రాలను కలిసి చూడటం చాలా అసహ్యకరమైన వ్యవహారమంటూ కళాశాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ  కాలేజీ అప్పుడప్పుడు సామాజిక సమస్యలను విశ్లేషించటానికి అవకాశంగా ఇలాంటి కోర్సులను అందిస్తోంది అని కాలేజీ తన ప్రకటనలో తెలిపింది.
Also Read : M. Venkaiah Naidu : ఆర్ధిక సహాయం కోరిన ఉపరాష్ట్రపతి ?
కోర్సులో భాగంగా లెక్చరర్లు, విద్యార్థులు తరగతి గదిలోనే కలిసి కూర్చుని పోర్న్‌ సినిమాలను తిలకిస్తూ స్త్రీ, పురుష లైంగిక సంబంధాలపై జాతి, వర్గం, లింగ విభేదాల ప్రభావం గురించి చర్చలు జరుపుతారని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు