To Court For Pig
Man Fights To Keep His Pet Pig Emotional Support : ఎవరైనా కుక్కలు,పిల్లలు,కుందేళ్లను పెంచుకుంటారు.కానీ ఓ వ్యక్తి మాత్రం పందిని పెంచుకుంటున్నాడు. కానీ పందిని ఇంటిలో పెంచుకోవటం కుదరదు..పంది ఫామ్ జంతువు.. ఫామ్‌హౌస్‌లోనో లేదా అడవిలో వదిలేయాలని అధికారులు హెచ్చరించారు. కానీ నేను నా పందిని వదిలేది లేదని తేల్చి చెప్పటంతో అధికారులు సదరు వ్యక్తిపై కేసు పెట్టారు. దీంతో పంది కోసం న్యాయపోరాటం చేయటానికి కోర్టు మెట్లెక్కాడు ఆ పంది యజమాని.
Also read : IPL auction 2022: ఐపీఎల్ వేలంలో స్పృహ తప్పి పడిపోయిన నిర్వహకుడు హ్యూ ఎడ్మీయడస్
అమెరికాలోని కెనాజోహరీలో ప్రాంతంలో ఫ్లాట్ అనే వ్యక్తి 110 పౌండ్లు బరువు ఉన్న ఓ పందిని పెంచుకుంటున్నాడు. దనాకి ముద్దుగా ‘ఎల్లి’అనే పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ పందితో ఎన్నో విషయాలు చెబుతుంటాడు. అతనికి సంతోషం వచ్చినా బాధ కలిగినా అన్నీ దానికే చెప్పుకుంటాడు.ఇంటిలో ఆ పందికి ప్రత్యేకంగా ఓ రూమ్ కూడా ఏర్పాటు చేశాడు. ఆ రూమ్ లో దారిని ఓ పరుపు ఉంటుంది పడుకోవటానికి. దానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు.
ప్లాట్ పందిని పెంచుకోవటంపై స్థానిక అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని, అది ఫామ్ జంతువని, అందువల్ల దాన్ని ఫామ్‌హౌస్‌లో లేదా అడవిలో వదిలేయాలని ఫ్లాట్‌కు సూచించారు.
Also read : Operation Parivartan At AOB : గంజాయి పండించటానికి మావోయిస్టులు సహకరిస్తున్నారు : DGP గౌతం సవాంగ్
కానీ నా పందిని వదులుకునేదే లేదని తేల్చి చెప్పాడు ప్లాట్. అయనా అధికారులు ఏమాత్రం ఊరుకోలేదు. పందిని ఇంట్లో ఉంచుకోవటానికి వీల్లేదని తెగేసి చెప్పారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఫ్లాట్ అధికారులపై క్రిమినల్ కేసు వేశాడు. ఎల్లి తనను కష్ట సమయాల్లో ఓదార్చిందని..నా ఎల్లి కుక్కల కన్నా ఎంతో తెలివైందని, దాన్ని వదులుకోనని కోర్టుకు చెప్పాడు. నాకు న్యాయం చేయండీ..నా పందిని నానుంచి దూరం చేయవద్దని వేడుకుంటున్నాడు. మరి దీనిపై న్యాయస్థానం ఏం చెబుతుందో మరి..