Operation Parivartan At AOB : గంజాయి పండించటానికి మావోయిస్టులు సహకరిస్తున్నారు : DGP గౌతం సవాంగ్

గంజాయి సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టామని ఏపీ డీజీపీ ఎంపీ గౌతం సవాంగ్ తెలిపారు.గంజాయి సాగుకు మావోయిస్టులు సహకరిస్తున్నారని తెలిపారు.

Operation Parivartan At AOB : గంజాయి పండించటానికి మావోయిస్టులు సహకరిస్తున్నారు : DGP గౌతం సవాంగ్

Operation Parivartan At Aob

Operation Parivartan At AOB : ఏపీలో అక్రమంగా గంజాయి తరలింపులు యదేచ్ఛంగా కొనసాగుతునే ఉన్నాయి. దీనిపై డీజీపీ ఎంపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ..గంజాయి సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గంజాయి స్మగ్లర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారని..తాము ఎంత పకడ్బంధీగా నిఘా పెట్టినా అక్రమార్కులు పలు మార్గాల్లో ఈ అక్రమ తరలింపులు కొనసాగిస్తున్నారని అన్నారు. గంజాయి పండించేవారికి మావోయిస్టులు సహకరిస్తున్నారని దాని ద్వారానే వారు డబ్బులు సమకూర్చుకుంటున్నారని తెలిపారు. ఏపీ, ఓడిసాలో 23 జిల్లాలో,విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో గంజాయి సాగు అవుతోందని వెల్లడించారు. గంజాయిని సమూలంగా నాశనం చేయటానికి ‘ఆపరేషన్ పరివర్తన’ ద్వారా 11 మండలాల్లో 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో 9251.32 కోట్లు విలువ చేసే 7552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్యంసం చేపట్టామని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

Also read : Pak MP Mariiage : 18 ఏళ్ల యువతిని మూడో పెళ్లి చేసుకున్న 49 ఏళ్ల పాకిస్థాన్ ఎంపీ
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (AOB)లో గంజాయి సాగును నిర్మూలించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (SBE) ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ను ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఐదు రోజుల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించింది. గంజాయి సాగుతో కలిగే దుష్పరిణామాలపై పోలీసులు, నిపుణులు గిరిజనులకు అవగాహన కల్పించారు. మరోవైపు ఎస్‌ఈబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతో పాటు అన్ని ప్రధాన మార్గాల్లో తనిఖీలు చేస్తూ నిఘాను పటిష్టపరిచారు. మొత్తం 283 కేసులు నమోదు చేసి 763 మందిని అరెస్టు చేశారు. 9,266 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 179 వాహనాలను జప్తుచేశారు.

Also read : Cellphone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఇకపై చట్టబద్ధం: నితిన్ గడ్కరీ

260 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం..
విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం లక్ష్యంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఇతర సిబ్బంది 7 బృందాలుగా పాడేరులో మకాం వేశారు. జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో కొన్ని రోజుల క్రితం 260 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

Also read : Pakistan ISI Hijab Rrow: హిజాబ్ వివాదాన్నిఅనుకూలంగా చేసుకుని భారత్ లో ISI కుట్రకు ప్లాన్: ఇంటెలిజెన్స్ వార్నింగ్

అనకాపల్లి అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బొయితిలి ప్రాంతంలో 40 ఎకరాలు, గుప్పవీధిలో 40 ఎకరాలు, ఎగువ వాకపల్లిలో 55 ఎకరాలు, దిగువ వాకపల్లిలో 55 ఎకరాల్లో సుమారు 2 లక్షల గంజాయి మొక్కల్ని వేర్లతోసహా పీకివేశారు. వాటికి నిప్పంటి పూర్తిగా తగులబెట్టారు. గూడెంకొత్తవీధి మండలంలోని రింతాడ, దామనాపల్లి పంచాయతీల పరిధిలో సిగినాపల్లి, నల్లబెల్లి, తుప్పలదొడ్డి, గుర్రాలవీధి, అసరాడ, కాకరపాడు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో, చింతపల్లి మండలంలోని టేకులవీధి, గడపరాయిలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.