Cellphone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఇకపై చట్టబద్ధం: నితిన్ గడ్కరీ
సెల్ ఫోన్ డ్రైవింగ్ కు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర రవాణాశాఖ సన్నాహాలు చేస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు

Cellphone Driving
Cellphone Driving: ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూ కొందరు వాహనదారులు పోలీసులకు పట్టుబడితే.. ఇక అంతే సంగతులు. ఒక్కోసారి ఫైన్ తో సరిపెట్టే పోలీసులు..వాహనదారుడి సెల్ ఫోన్ ను, వాహనాన్ని సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇకపై ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే.. పోలీసులకు చిక్కుతామోననే భయం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. సెల్ ఫోన్ డ్రైవింగ్ కు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర రవాణాశాఖ సన్నాహాలు చేస్తుంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం పార్లమెంట్ లో మాట్లాడుతూ..పలు విషయాలు వెల్లడించారు.
Also read: Pak MP Mariiage : 18 ఏళ్ల యువతిని మూడో పెళ్లి చేసుకున్న 49 ఏళ్ల పాకిస్థాన్ ఎంపీ
సెల్ ఫోన్ డ్రైవింగ్ కారణంగా గతంలో వాహనదారులు ప్రమాదాలకు గురైన సందర్భాలను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడడం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణగా పేర్కొన్నారు. అయితే పెరుగుతున్న సాంకేతికత కారణంగా చేతితో ఫోన్ పట్టుకోకుండానే వైర్‌లెస్, బ్లూటూత్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వాహనదారులు డ్రైవింగ్ లో ఉన్న సమయంలో తమ ఫోన్.. జేబులోనే ఉంచి..”హ్యాండ్స్ ఫ్రీ” ఇయర్ ఫోన్స్ తో అనుసంధానించి మాట్లాడుకోవచ్చని నితిన్ గడ్కరీ వివరించారు. అయితే ఈ తరహా విధానంలో కొన్ని షరతులు విధించనున్నారు.
Also read: Rajinikanth: యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి అవకాశాలిస్తున్న తలైవా.. ఫలితం ఫ్లాపులు!
ఫోన్ ఖచ్చితంగా వాహనదారుడి జేబులోనే ఉండాలి. బ్లూటూత్ కనెక్ట్ అయి ఉన్న సమయంలో పోలీసులు ఆపినా.. వారికి సహకరించి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. “హ్యాండ్స్ ఫ్రీగా” సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పోలీసులు సదరు వాహనదారుడిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఒక వేళా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి చలాన్ విధించినా, వస్తువులు సీజ్ చేసినా.. వాహనదారులు కోర్టుకు వెళ్లొచ్చు. అయితే ఈ విధానం కేవలం కార్లకే పరిమితమా లేక ద్విచక్ర వాహనదారులకు వర్తిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
Also read: Statue of Equality : విష్ణు సహస్ర నామ పారాయణంతో మారుమ్రోగిన ముచ్చింతల్