Statue of Equality : విష్ణు సహస్ర నామ పారాయణంతో మారుమ్రోగిన ముచ్చింతల్

శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని

Statue of Equality : విష్ణు సహస్ర నామ పారాయణంతో మారుమ్రోగిన ముచ్చింతల్

Samata Murthi

Vishnu Sahasranama Parayanam : విష్ణు సహస్ర నామ పారాయణంతో ముచ్చింతల్ మారుమ్రోగింది. భారీగా తరలివచ్చిన భక్తులు పారాయణం చేసుకుంటూ ముందుకెళ్లారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి..ఇతర స్వామిజీలు ముందుకెళుతుండగా.. వెనుక భక్తులు పారాయణం చేస్తూ నడుచుకుంటూ వెళ్లారు. మొత్తం యాగశాల చుట్టూగా ప్రదిక్షణలు చేశారు. ఇసుకవేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో శ్రీరామనగరం ఆధ్మాత్మికత వాతావరణం నెలకొంది. జై శ్రీమన్నారాయణ అంటూ ముందుకెళ్లారు. వయస్సుతో సంబంధం లేకుండా పారాయణం చేస్తూ..భక్తితో నడిచారు.

Read More : Pakistan ISI Hijab Rrow: హిజాబ్ వివాదాన్నిఅనుకూలంగా చేసుకుని భారత్ లో ISI కుట్రకు ప్లాన్: ఇంటెలిజెన్స్ వార్నింగ్

2022, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని ముందుగానే చిన్న జీయర్ స్వామి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. విష్ణు సహస్రనామాల్లో ఒక శ్లోకం కొంతమంది చదవగా.. తర్వాత వచ్చే శ్లోకాన్ని మరికొంత మంది చదువుతూ నడిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వాలంటీర్లు ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ మంచినీటి సౌకర్యం కల్పిస్తూ..వారికి సేవలందించారు. మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులకు ఇక్కడ సందర్శన ఉంటుందని, అనంతరం పోలీసులు పలు చర్యలు తీసుకుంటారని చిన్న జీయర్ తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వస్తుండడంతో భద్రతా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా యాగశాలలో వారు తనిఖీలు నిర్వహిస్తారని, భక్తులకు ఎవరినీ అనుమతించరని..ఇందుకు ప్రజలు సహకరించాలని సూచించారు.

Read More : YSRCP MLA Roja : యాదాద్రి నిర్మాణం అద్భుతం.. ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్‌‌కు దక్కింది

ముచ్చింతల్ వెలిగిపోతోంది. భగవత్‌ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శ్రీరామనగరంలో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. యజ్ఞాలు, అష్టాక్షరీ మంత్ర పఠనాలు.. చతుర్వేద పారాయణాలతో .. నిర్విఘ్నంగా, నిరంతరాయంగా, నిరాటంకంగా సమతామూర్తి వెయ్యేళ్ల పండుగ జరుగుతోంది. రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రముఖులు, దేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కేంద్ర మంత్రులు, గవర్నర్ లు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, ఇతరుల స్వామీజీల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమం భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతోంది.