హెచ్ఐవీ నివారణలో చారిత్రక ముందడుగు.. రెండు ఇంజెక్షన్లతో వ్యాధి మాయం..
హెచ్ఐవీ నివారణలో చారిత్రక ముందడుగు పడింది. యెజ్ టుగో బ్రాండ్‌తో తయారైన లెనకాపవిర్ అనే మెడిసిన్ హెచ్ఐవీ నుంచి ..

HIV: హెచ్ఐవీ ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీనిపేరు వినడానికి కూడా ప్రజలు ఇష్టపడరు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ వ్యాధికి చికిత్స లేదు. కానీ, దశాబ్దకాలంగా ఈ వ్యాధి నివారణకు మందులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు, దీనిని పూర్తిగా నిర్మూలించడానికి ఎటువంటి ఔషధం, వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. తాజాగా.. హెచ్ఐవీ నివారణకు కొత్త ఔషదం అందుబాటులోకి రానుంది.
హెచ్ఐవీ నివారణలో చారిత్రక ముందడుగు పడింది. యెజ్ టుగో బ్రాండ్‌తో తయారైన లెనకాపవిర్ అనే మెడిసిన్ హెచ్ఐవీ నుంచి 99.9శాతం రక్షణ అందిస్తున్నదని దాన్ని అభివృద్ధి చేసిన సంస్థ గిలియడ్ సైన్సెస్ వెల్లడించింది. లెనకాపవిర్ ఔషధానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదం లభించిందని తెలిపింది. ఈ ఔషదాన్ని ఏడాదికి రెండు సార్లు అంటే.. ఆరు నెలలకు ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవటం ద్వారా హెచ్ఐవీ నుంచి 99.9శాతం రక్షణ పొందవచ్చునని గిలియడ్ సైన్సెస్ సంస్థ వెల్లడించింది.
పెద్దలు, కౌమారదశలో ఉన్నవారిలో హెచ్ఐవీ సంక్రమణ ప్రమాదాన్ని లెనాకాపావిర్ తగ్గిస్తుందని తేలినట్లు సంస్థ తెలింది. ఈ ఔషదంపై రెండు ట్రయల్స్ నిర్వహించారు. తొలి ట్రయల్.. సబ్‌సహారా ఆఫ్రికాలో 2వేల కంటే ఎక్కువ మంది మహిళలతో నిర్వహించడం జరిగిందని, దీని ఫలితంగా ఇన్పెక్షన్లు 100శాతం తగ్గాయని సంస్థ తెలిపింది. రెండో ట్రయల్ లో భాగంగా 99.9శాతం నివారణ రేటు నమోదైందని వెల్లడించింది. అయితే, ఈ కొత్త మెడిషన్ ధర మాత్రం భారీగా ఉంది. ఈ మెడిసిన్ ధర రూ.20.80లక్షల నుంచి 32.50లక్షలుగా ఉంది.
గిలియడ్ ఈ ఇంజెక్షన్‌ను అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాలలో ప్రారంభించాలని యోచిస్తోంది. దీనితో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా దీనిని అందుబాటులోకి తేవాలని కంపెనీ భావిస్తోంది.