Alzheimer's Disease
Alzheimer’s Disease : ప్రపంచ వ్యాప్తంగా అల్జీమర్స్ వ్యాధితో సుమారు నాలుగున్నర కోట్లమంది బాధపడుతున్నారు. మెమొరీ సరిగా పనిచేయకపోవడం కారణంగా మతిమరుపు సమస్య వస్తుంది.. ఇది ఎక్కువగా 50 ఏళ్ళు పైబడిన వారిలో కనిపిస్తుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణంతో మెదడులో హానికర ప్రోటీన్ పెరిగిపోవడం. ఈ ప్రోటీన్స్ మెమొరీ బంగాన్ని నష్టపరుస్తాయి. మానవుడి జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి.
చదవండి : London : వ్యాన్‌ను జుట్టుతో లాగేసింది..నెటిజన్ల ట్రోలింగ్..ఏ షాంపు వాడుతున్నావు తల్లీ
అయితే ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ థెరపీని తీసుకొచ్చారు. ఇప్పటికే జంతువులపై చేసిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని, వచ్చే రెండేండ్లలో మనుషులపై ప్రయోగాలు జరిపి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇక దీని ధర రూ.450గా ఫిక్స్ చేశారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మతిమరుపు నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు.
చదవండి : London-Kochi : విమానంలో మహిళకు పురిటి నొప్పులు, డెలివరీ ఎవరు చేశారంటే
vaccine, Alzheimer’s Disease, London, release soon, clinical trails