New York
Vaccine Mandate : కరోనా భూతం ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తోంది. పలు దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు ఇంకా ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలతో పాటు వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కానీ కొంతమంది బేఖాతర్ చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వ్యాక్సిన్ వేసుకోని 3 వేల మంది మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకొనేందుకు సిద్ధమౌతున్నారు.
Read More : Indian Railways : ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీ
సిబ్బంది టీకాలు తీసుకోకపోతే.. పని చేయడానికి అనుమతించబడరని న్యూయార్క్ మేయర్ ఎరిక్ అడమ్స్ ప్రకటించారు. దీనివల్ల దాదాపు 3 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అక్కడి ప్రముఖ పత్రిక వెల్లడించింది. నగరంలో 3,70,000 మంది కార్మికుల్లో 95 శాతం కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఉపాధ్యాయులను తొలగించకూడదని భావిస్తానని, కానీ.. వైరస్ కు వ్యతిరేకంగా టీకా తీసుకోవాల్సి ఉంటుందని మేయర్ తెలిపారు.
Read More : RGV: మెగా సూపర్ డూపర్ ఓమెగా స్టార్ జగన్.. ఆగని ఆర్జీవీ ట్వీట్ల పర్వం!
నగర ఉద్యోగులు తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందేనని గురువారం ఓ వార్త సంస్థకు తెలిపారు. దీనిని అందరూ అర్థం చేసుకున్నారన్నారు. అయితే.. 13 వేల మంది కార్మికులు మినహాయింపుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 54 మంది దరఖాస్తులను పరిష్కరించినట్లు.. దాదాపు 2100 ఆమోదించబడగా 4 వేల 910 తిరస్కరించబడ్డాయి.