Indian Railways : ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు పీజుగా 100రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Indian Railways : ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీ

Indian Raiway (1)

Updated On : February 12, 2022 / 11:03 AM IST

Indian Railways : ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆర్ఆర్ సి భువనేశ్వర పరిధిలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 756 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ ట్రేడ్ లు, వర్క్ షాప్ లో యాక్ట్ అప్రెంటీస్ ఈ ఖాళీ ఉన్నాయి.

ఖాళీల వివరాలకు సంబంధించి క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్ మంచేశ్వర్, భువనేశ్వర్ లో 190 అప్పెంటిస్ ఖాళీలు, ఖుర్దా రోడ్ డివిజన్ లో 237 ఖాళీలు, వాల్టెయిర్ డివిజన్ లో 263 ఖాళీలు, సంబల్పూర్ డివిజన్ లో 66 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 10వ తరగతి 50శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐఐటీ కోర్సు చేసి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు పీజుగా 100రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సి,ఎస్టీ, పిడబ్ల్యూడి, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు మార్చి 7, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ eastcoastrail.indianrailways.gov.in