Pakistan: పాకిస్థాన్‌లో లోయ‌లో ప‌డిన బ‌స్సు.. విహారయాత్ర ముగించుకొని వ‌స్తుండ‌గా ఘ‌ట‌న‌

పాకిస్థాన్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. విహార యాత్ర‌కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా బ‌స్సు లోయ‌లో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 11 మంది మృతి ప్ర‌యాణికులు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి.

Pakistan

Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. విహార యాత్ర‌కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా బ‌స్సు లోయ‌లో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 11 మంది  ప్ర‌యాణికులు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. వారి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న మంగళవారం సాయంత్రం వాయువ్య పాకిస్థాన్‌లో పర్వత రహదారిలో చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ లోయలోని గాబిన్ జబ్బా సమీపంలోని సుందరమైన లాల్కో లోయలో పర్యాటకుల‌తో వెళ్తున్న వాహనం ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి లోతైన లోయలో పడటంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

pakistan : పాకిస్థాన్‌ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. 147 మంది మృతి

మృతులంతా స్వాత్ లోయలోని మట్టా తహసీల్ వాసులుగా గుర్తించామని, వారు విహారయాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని రెస్క్యూ అధికారులు తెలిపారు. ప్ర‌మాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన ఇద్దరికి మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి
స్వాత్ లోయ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే సుంద‌ర‌మైన ప్ర‌దేశం. అక్క‌డి జ‌ల‌పాతాలు, వివిధ ఆకృతుల్లో గ్రానైట్ శిఖ‌రాలు ప‌ర్యాట‌కుల‌ను, సాహ‌స ప్రియుల‌ను ఎంతో ఆక‌ర్షిస్తాయి. అయితే ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో రోడ్డు స‌దుపాయం స‌రిగా లేక‌పోవ‌టం వ‌ల్ల‌నే బ‌స్సు లోయ‌లోప‌డింద‌ని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే గ‌త ప‌దిరోజుల క్రితం నైరుతి పాకిస్థాన్‌లో భారీ వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌యాణీకుల బ‌స్సు ప‌ర్వ‌త ర‌హ‌దారిపై నుండి జారి లోయ‌లో ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 19 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే మ‌రో ప్ర‌మాదం చోటు చేసుకుంది.