Auckland Airport : ఇలాగ కూడా ప్రపోజ్ చేయచ్చా?.. ఓ కుర్రాడు.. తన గాళ్ ఫ్రెండ్‌కి ..

ఓ అబ్బాయి తన గాళ్ ఫ్రెండ్‌కి డిఫరెంట్‌గా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. జీవితాంతం అది గుర్తుండిపోవాలని అనుకున్నాడు. అందుకోసం ఏం చేసాడు? చదవండి.

Auckland Airport : ఇలాగ కూడా ప్రపోజ్ చేయచ్చా?.. ఓ కుర్రాడు.. తన గాళ్ ఫ్రెండ్‌కి ..

Auckland Airport

Auckland Airport : ఒక అబ్బాయి తన స్నేహితురాలికి డిఫరెంట్‌గా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి సాక్షిగా అతను ఎక్కడ ప్రపోజ్ చేశాడు? ఎలా ప్రపోజ్ చేసాడో చదవండి.

United States : యాంకర్‌కి లైవ్‌లో ప్రపోజ్ చేసిన రిపోర్టర్.. ఎక్కడంటే?

ప్రేమికులు తమ ప్రేమను మొదటిసారి వ్యక్తపరుచుకునే క్షణం ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే అది జీవితాంతం జ్ఞాపకంగా మిగిలిపోతుంది. యష్ రాజ్ అనే కుర్రాడు తన గాళ్ ఫ్రెండ్ రియాకు చాలా సర్ప్రైజ్‌గా ప్రపోజ్ చేశాడు. అతను ప్రపోజ్ చేసిన తీరు బాలీవుడ్ సినిమా తరహాలో అందరి మనసుని ఆకట్టుకుంది.

చాలా ఎయిర్‌పోర్టులలో వీడ్కోలు చెప్పుకునేవారు.. తిరిగే కలుసుకునే వారు కనిపిస్తుంటారు. అలాంటి దృశ్యాలు భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. చాలా సినిమాల్లో క్లైమాక్స్‌లో రొమాంటిక్ ప్రపోజల్స్ ఎక్కువగా ఎయిర్‌పోర్టులో జరుగుతుంటాయి. న్యూజిల్యాండ్‌లోని ఆక్లాండ్ ఎయిర్‌పోర్టులో యష్ రాజ్ అనే కుర్రాడు తన గాళ్ ఫ్రెండ్ రియాకి రియల్ లైఫ్‌లో అలాగే ప్రపోజ్ చేసి సర్పైజ్ చేశాడు. యష్ రాజ్ ఆక్లాండ్ ఎయిర్ పోర్టు అధికారులను సంప్రదించి PA సిస్టమ్‌లో రియాకు తన ప్రపోజల్ చెప్పేందుకు సాయం చేయమని రిక్వెస్ట్ చేశాడు. అందుకు వారు సహకరించారు.

United States : 63 ఏళ్ల తర్వాత హైస్కూల్ క్రష్‌కు ప్రపోజ్ చేసిన 78 ఏళ్ల వ్యక్తి

యష్ రాజ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారంతా ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని రాసి ఉన్న బ్యానర్లను పట్టుకున్నారు. యష్ రాజ్  PA సిస్టమ్ ముందు ముందుగానే రికార్డ్ చేసి ఉంచిన పెళ్లి ప్రతిపాదనను వినిపించారు. అది విన్న ఆమె ఆశ్చర్యానికి గురైంది. ఒక్క క్షణం భావోద్వేగానికి గురైంది. రియా అతని ప్రపోజల్ అంగీకరించడంతో అక్కడున్న వారంతా సంబరపడిపోయారు. ఈ ప్రపోజల్‌కి సంబంధించిన వీడియోను aucklandairport ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

‘ఆక్లాండ్ విమానాశ్రయంలో ప్రేమ గాలిలో ఉంది. రియా, యష్ రాజ్‌లకు అభినందనలు.. ఇందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు’ అనే శీర్షికతో ఆక్లాండ్ ఎయిర్‌పోర్టు వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Auckland Airport (@aucklandairport)