Rice bag inspection : బియ్యం నాణ్యత చూసే విధానం ఇంత భయంకరంగా ఉంటుందా?

ప్రపచంలో ఏ బియ్యం గోదాములో అయినా బియ్యం నాణ్యతను పరీక్షిస్తారు. అయితే ఓ మహిళ బియ్యం పరీక్ష చేసే విధానం భయం కలిగించేలా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగిన బస్తాలు మోసే కూలీల పరిస్థితి ఏంటో అని చూసిన వారు షాకవుతున్నారు.

Viral Video

Viral Video : ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు చూస్తుంటే భయం వేస్తుంది.. కొన్ని ఆలోచింప చేసేవి.. కొన్ని స్ఫూర్తి నింపేవి కూడా ఉంటాయి. మీరు చూడబోయే వీడియోలో ఓ మహిళ బియ్యం నాణ్యతను తనిఖీ చేస్తోంది. చూసేవారికి భయం కలిగించేలా ఉంది ఆ వీడియో.

Temjen Imna Along : మహిళా సాధికారతపై నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ షేర్ చేసిన వీడియో వైరల్

techniiverse అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్ చేయబడిన ఓ వీడియో 25 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇంతకీ వీడియోలో అంతగా ఏముందనేగా.. ఓ మహిళ గోదాములో ఉన్న బియ్యం బస్తాల నాణ్యతను తనిఖీ చేస్తోంది. కూలీలు బియ్యం బస్తాలను మోసుకుని వరుసగా వెళ్తుంటే డిటెక్టర్ సాయంతో ఆమె బియ్యం పరీక్షించే విధానం భయం కలిగించింది. ఆమె ఉపయోగించే డిటెక్టర్ ఏ మాత్రం గురి తప్పిన మనుష్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అన్నట్లుగా ఉంది. కత్తిలా పదునుతో ఉన్న డిటెక్టర్ చూస్తే భయం కలిగించింది. బియ్యం నాణ్యత పరీక్షించడం ఏ గోదాములో అయినా అవసరం.. కానీ ఈ పద్ధతి మాత్రం విచిత్రంగా ఉండటంతో చూసన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Jackie Shroff : పేదరికం కుటుంబాన్ని దగ్గరగా ఉంచుతుందన్న జాకీష్రాఫ్ వీడియో వైరల్

ఈ వీడియోకి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ‘డిటెక్టర్ చాలా పదునుగా కనిపిస్తోంది.. చిన్న పొరపాటు జరిగితే బస్తా మోసే కూలీ పని అంతే’ అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. బియ్యం నాణ్యత పరీక్షించే మహిళ సంగతి ఏమో కానీ.. వీడియో చూస్తుంటే బస్తా మోసేవాడు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి అనిపిస్తోంది.