Temjen Imna Along : మహిళా సాధికారతపై నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ షేర్ చేసిన వీడియో వైరల్

నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్‌ని తాజాగా అక్కడి పర్యాటక శాఖ షేర్ చేసిన వీడియో ఒకటి ఆకర్షించింది. మహిళా శక్తికి ప్రతిరూపంగా నిలిచింది అంటూ ఆ వీడియోను టెమ్‌జెన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Temjen Imna Along : మహిళా సాధికారతపై నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ షేర్ చేసిన వీడియో వైరల్

Temjen Imna Along

Temjen Imna Along : నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా నాగాలాండ్ పర్యాటక శాఖ షేర్ చేసిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మహిళా సాధికారతకు అద్దం పడుతున్న ఆ వీడియోపై ప్రజలు స్పందిస్తూ కామెంట్లు పెట్టారు.

Temjen Imna: అందమైన అమ్మాయిలతో నాగాలాండ్ మంత్రి గ్రూప్ ఫోటో.. ఆయన చూపులు మాత్రం..

నాగాలాండ్ టూరిజం తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో nagalandtourism ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో నాగాలాండ్ ఫేక్ జిల్లాలో మహిళలు వరినాట్లు నాటుతున్నదృశ్యం కనిపిస్తుంది. ‘నాగాలాండ్ ఫేక్ జిల్లా పొలాల్లో మహిళలు వరి నాటుతున్న దృశ్యం వారి ఐక్యతకు, మహిళా సాధికారతకు అద్దం పడుతోంది.

 

ఉజ్వల భవిష్యత్తు కోసం మార్పు అనే విత్తనాలు నాటుతున్నారు’ అనే శీర్షికతో షేర్ అయిన వీడియో నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ ని ఆకర్షించింది. వెంటనే ఆయన దానిని షేర్ చేశారు. ‘ఎక్కడ మహిళ శక్తి కలిగి ఉంటారో అక్కడ భూమి సంతోషంగా నవ్వుతుంది’ అనే శీర్షికతో షేర్ చేశారు. వీడియోలో మహిళలు సామూహికంగా వరినాట్లు నాటుతూ కనిపిస్తారు. ఈ పోస్టు చాలామంది నెటిజన్లను ఆకర్షించింది. చాలామంది వీడియోపై కామెంట్లు చేశారు.

Copy Content : కాపీ చేస్తే చాలు.. నెటిజన్లు పట్టేస్తున్నారు..

“సూపర్. నాగాలాండ్ పర్యాటక శాఖ నుండి అద్భుతమైన వీడియో. శుభాకాంక్షలు” అని ఒకరు.. “బాసుమతి బియ్యం నాటడానికి కష్టపడుతున్నారు” అని మరొకరు.. “నాగాలాండ్ మే హీ సెటిల్ హో జాతే హై” అని ఇలా వరుసగా కామెంట్లు పెట్టారు.