Guatemala : అగ్నిపర్వతంపై పిజ్జా వండుకుని తిన్న మహిళ

ఆమెకు విహార యాత్రలు చేయడం సరదా.. కొత్త కొత్త ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడమంటే మరీ ఇష్టం. తాజాగా గ్వాటెమాలలోని వాల్కనోని సందర్శించి అక్కడ పిజ్జా వండుకుని తింది. అక్కడ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Guatemala

Guatemala : చాలామంది విహారయాత్రలు చేయడానికి ఇష్టపడతారు. చిత్ర విచిత్రమైన ప్రదేశాలు సందర్శించి వస్తుంటారు. అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే మహిళకు అగ్ని పర్వతం మీద పిజ్జా వండుకుని తినాలనిపించింది. ఇదేం కోరిక అనుకోకండి. ఆమె వెళ్లడమే కాదు సరదాగా పిజ్జా కూడా తయారు చేసుకుని తింది.

Flying Pizza : ఫ్లయింగ్ పిజ్జా చూసారా? ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చూసేయండి..

అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే పర్యాటకురాలు గ్వాటెమాలలో యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తిన్న వీడియో వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (alexandrablodgett) ఆమె స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తినడానికి గ్వాటెమాలకు వెళ్తున్నాను. అంటే అక్కడి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడటానికి కూడా. 2021 లో బద్దలైన ఇక్కడి అగ్ని పర్వతం యాక్టివ్‍గానే ఉంది. ఈ నేషనల్ పార్క్‌ లోనికి వెళ్లాలంటే తప్పనిసరిగా గైడ్ ఉండాలి. మేము పిజ్జా తయారు చేయడం కోసం ముందుగానే బుక్ చేసుకున్నాము. అక్కడ చలిగా ఉంటుంది.. గాలులు వీస్తాయి’ అనే క్యాప్షన్‌తో అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ తన పోస్టును షేర్ చేసుకుంది.

Trump Offers Eaten Pizza : నేను కొరికిన పిజ్జా పీస్ ఎవరికైనా కావాలా? ఆఫర్ చేసిన ట్రంప్

వీడియోలో ఒక వ్యక్తి కూరగాయలతో వండని పిజ్జాను ట్రేలో ఉంచి అక్కడి నేలపై పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత దానిని తీసి అందించాడు. ఇక అలెగ్జాండ్రా దానిని తింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.