Flying Pizza : ఫ్లయింగ్ పిజ్జా చూసారా? ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చూసేయండి..

పిజ్జాలలో ఫ్లయింగ్ పిజ్జాలు వేరయా? ఫ్లయింగ్ పిజ్జాలేంటి? అని ఆశ్చర్యపోతున్నారా?. ఓ పిజ్జా వ్యాపారి ఎలా తయారు చేసి అమ్ముతున్నాడో చూడండి.

Flying Pizza : ఫ్లయింగ్ పిజ్జా చూసారా? ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చూసేయండి..

Flying Pizza

Updated On : April 27, 2023 / 1:18 PM IST

Flying Pizza :  వీధి వ్యాపారులు జనాల్ని ఆకర్షించడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలా ఓ అమ్మకం దారుడు చూపిస్తున్న టాలెంట్ చూస్తే నోరెళ్లబెడతారు. ఫ్లయింగ్ పిజ్జా చూడాలనుకుంటున్నారా?

Trump Offers Eaten Pizza : నేను కొరికిన పిజ్జా పీస్ ఎవరికైనా కావాలా? ఆఫర్ చేసిన ట్రంప్

కొంతమంది వీధి వ్యాపారులు దోసెలు, దహీ భల్లాలు గాల్లో ఎగరవేస్తుంటారు. ఐస్ క్రీం అమ్మకందారులు కూడా కోన్ లో ఆటపట్టించి గానీ ఇవ్వరు. ఓ పిజ్జా అమ్మకం దారుడు పిజ్జాని తయారు చేసే విధానంతోనే జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. పిండిని సన్నని, గుండ్రి రొట్టెగా చుట్టిన తర్వాత, దానిని టేబుల్ పై తట్టి నేల నుండి కొన్ని అడుగుల ఎత్తులోకి గాలిలోకి విసిరి దాన్ని అందుకుంటున్నాడు. ఇతని నైపుణ్యాన్ని చూసి అందరూ వావ్ అంటున్నారు. సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ పేజీలో షైరైన ఈ వీడియోపై చాలామంది స్పందించారు.

Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు

అద్భుతమైన స్కిల్స్ చూసి చాలామంది అబ్బురపడుతున్నారు. అయితే గాల్లోకి ఎగిరిన పిజ్జాతో పాటు దోమలు, ఈగలు కూడా అందులోకి చేరే ప్రమాదం ఉందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. తన షాపులో విక్రయాలు జోరందుకునేందుకు ఈ వ్యాపారి చేస్తున్న పనికి.. అతనికి స్కిల్స్ కి అభినందనలు చెప్పకుండా ఉండలేం.