Elephant kills Crocodile : పిల్లను కాపాడుకోవటానికి మొసలిని తొక్కి చంపిన ఏనుగు

పిల్లను కాపాడుకోవటానికి ఓ తల్లి ఏనుగు మొసలితో పోరాటం చేసింది. మొసలిని తన కాళ్లతో తొక్కి తొక్కి అంతమొందించింది. తొండంతో ఈడ్చి కొట్టి చంపింది.

Mother Elephant kills Crocodile To Save Her Calf  : అమ్మతనం మనుషులకు జంతువులకు, పక్షులకు వేరు కాదు. అమ్మ అంటే అమ్మే. తన బిడ్డలకు ఆపద వస్తే తన ప్రాణాలకు కూడా లెక్క చేయదు.అదే చేసింది ఓ ఏనుగు. తన బిడ్డను పట్టుకున్న మొసలిపై పోరాటం చేసింది. తన బిడ్డను మొసలి నోటినుంచి కాపాడుకుంది. ఆ మొసలిని తన బలమైన కాళ్లు తొక్కి తొక్కి తొండంతో ఈడ్చి కొట్టి మరీ అంతమొందించింది. జాంబియాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more : Because She IS Mother : వర్షం నుంచి పిల్లల్ని కాపాడుకంటున్న తల్లి పక్షి
జంతువులు తమ పిల్లల జోలికి వస్తే ఎంతలా దాడి చేస్తాయో తెలిసిందదే. చిన్న పక్షి కూడా తన పిల్లల జోలికి వస్తే ఎంత పెద్ద జంతువుతోనైనా సరే పోరాటానికి సిద్ధపడుతుంది. తనకేమవుతుందోననే విషయం ఏమాత్రం అనుకోదు. అచ్చం అటువంటిదే ఈ ఏనుగు ఘటన. నిజానికి ఏనుగులు ఎక్కడికి వెళ్లినా గుంపులు గుంపులుగా తరలి వెళతాయి. పిల్ల ఏనుగులను తల్లి ఏనుగులు వేయి కళ్లతో కాపాడుకుంటుంటాయి.కానీ పిల్ల ఏనుగులు చిలిపివి. అటు ఇటు పరుగులు పెడుతుంటాయి.

నీళ్లు కనిపిస్తే చాలు ఆపద ఉంటుందేమోనని ఆలోచించకుండా నీటిని తాగటానికో లేదా..ఆటలాడటానికో దిగిపోతాయి. అలా దిగిన ఓ ఏనుగు పిల్లపై కన్నేసిన ఓ మొసలు దాన్ని పట్టుకుంది. అంతే తల్లి ఏనుగుకు ఆగ్రహం వచ్చేసింది. నా పిల్లనే పట్టుకుంటావా? అన్నట్లుగా మొసలిపై దాడికి దింగింది. తన కోపాన్నంతా ఉపయోగించి మొసలిని అంతమొందించింది.

Read more:  Kolleru Pelicon : గూడకొంగకు అరుదైన గుర్తింపు..కొల్లేరు అంబాసిడర్‌గా ప్రకటించిన అటవీశాఖ

కాళ్లతో తొక్కి తొక్కి చంపింది.అక్కడితో ఊరుకోకుండా..తొండంతో ఆ మొసలి తోకను పట్టుకుని విసిరి విసిరికొట్టి మరీ అంతమొందింది. ఏనుగు మొసలిని చంపిన తీరు చూస్తే తన బిడ్డ మీద ఉన్న ప్రేమ..మరోపక్క మొసలిమీద ఉన్న తీవ్ర ఆగ్రహం కనిపిస్తుంది. అదే కదా మరి తల్లి ప్రేమ అంటే. తన బిడ్డల జోలికొస్తే ఊరుకుంటుందా? అంతమొందించి తీరుతుంది. అదే చేసిది ఆ తల్లి ఏనుగు..ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగినా..ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు