Kolleru Pelicon : గూడకొంగకు అరుదైన గుర్తింపు..కొల్లేరు అంబాసిడర్‌గా ప్రకటించిన అటవీశాఖ

గూడ కొంగకు అరుదైన గుర్తింపు లభించింది. కొల్లేరు బ్రాండ్ అంబాసిడర్ గా గూడకొంగ (పెలికాన్) ను అటవీశాఖ అధికారులు ప్రకటించారు.

Kolleru Pelicon : గూడకొంగకు అరుదైన గుర్తింపు..కొల్లేరు అంబాసిడర్‌గా ప్రకటించిన అటవీశాఖ

Pelicon Is The Kolleru Lake Ambassador

Pelicon is the Kolleru Lake Ambassador : గూడ కొంగకు అరుదైన గుర్తింపు లభించింది. కొల్లేరు బ్రాండ్ అంబాసిడర్ గా గూడకొంగ (పెలికాన్) ను అటవీశాఖ అధికారులు ప్రకటించారు. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్. ప్రతీప్ ‌కుమార్ గూడకొంగను కొల్లేరు బ్రాండ్ అంబాసిడర్ గా నిర్ణయించామని ప్రకటించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్సెస్ ఎన్. ప్రతీప్ ‌కుమార్ ఏపీ జీవవైవిధ్య మ్యాప్, గూడకొంగ లోగోను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు సరస్సు అంబాసిడర్‌గా గూడకొంగను ఎంపిక చేసామని..ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూడకొంగల్లో దాదాపు 40 శాతం కొల్లేరులోనే ఉన్నాయని వెల్లడించారు. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత అని..దాని కోసం కొల్లేరు ప్రాంతంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రామ్‌సర్ డిక్లరేషన్‌లో భాగంగా ప్రస్తుతం అభయారణ్యంగా, చిత్తడి నేలల ప్రాంతంగా కొల్లేరు సరస్సు ఎంపికైందని తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా వెట్‌ల్యాండ్ మిత్రాస్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కొల్లేరు సరస్సులోని సగం ప్రాంతం అభయారణ్యంగానూ, మరో సగం చిత్తడి నేలల ప్రాంతంగానూ ఉన్నట్టు పేర్కొన్నారు. “ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా త్వరలో కొల్లేరు సరస్సులో ఆవాసాలు ఏర్పరచుకునే అత్యంత అరుదైన పక్షులను జీవజాతులను పరిరక్షించాలనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రదీప్ కుమార్ తెలిపారు.

Read more : Wild Bird : 6 అడుగుల ఎత్తు,కత్తుల్లాంటి గోళ్లు..మనుషుల్ని చీల్చి చంపేసే పక్షి గురించి షాకింగ్ విషయాలు

ప్రపంచంలోని 40 శాతం గూడకొంగలు కొల్లేరులోనే ఆవాసం ఏర్పరచుకుని నివసించే ఈ గూడకొంగలు కొల్లేరు సరస్సుకు స్పెషల్ ఎట్రాక్షన్. ఈ కొంగలో ప్రత్యేక ఆకర్షణ 14 అంగుళాల పొడుగుగల దాని ముక్కు. ముక్కు చివరన కొనతిరిగి ఉంటుంది. ముక్కు కిందినుంచి కంఠం వరకు పెద్ద సంచీలాగా ఉంటుంది. దీని వల్ల చేపలు దాని ముక్కుకి పట్టుబడతాయి. దాని ముక్కుకు చేప దొరికింది అంటే ఇక తప్పించుకోవటం కష్టమే. సంచిలా ఉండే దాని మెడలోకి జర్రున జారిపోవాల్సిందే. దానికి ఆహారం అయిపోవాల్సిందే. ఇది కొంగ జాతే అయినా దీని కాళ్లు మాత్రం కాస్త బాతు పాదంలాగా ఉంటాయి.

ఇవి కొంగజాతి పక్షులే అయినా సముద్రాల్లో కూడా చేపల్ని వేటాడే స్పెషాలిటీ ఈ పెలికాన్లది. గూడ కొంగలు ఎక్కువగా అమెరికాల దూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉంటాయి. కాలిఫోర్నియా, కారోలినాస్ వరకు..ఉత్తర చిలీ.బ్రెజిల్ నైరుతీ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అలాగే కరేబియన్ దీవుల్లోని గాలి పాజెస్ ద్వీపాల్లో ఎక్కువగా ఉంటాయి.ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఈ పెలికాన్లలో 40 శాతం కొల్లేరులోనే ఆవాసం ఏర్పరచుకుని నివసిస్తుంటాయి. ఈ గూడకొంగలు కొల్లేరు సరస్సుకు స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి.

కాగా కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలంగా ఉంది. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి – పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది.కొల్లేరులో పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది.

Read more :కుమురంభీం అడవుల్లో వలస విన్యాసం : కనువిందు చేస్తున్న అరుదైన పక్షి ‘రూఫస్ బెల్లీడ్’..!

పురాతన గ్రంధాలలో కొల్లేరు ప్రస్తావన
రామాయణం అరణ్యకాండలో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరే నని ఆంధ్రదేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన చిలుకూరి వీరభద్రరావు భావించారు. ఈ విషయం “ఆంధ్రుల చరిత్రము – ప్రథమ భాగము”లో కొల్లేరు సరస్సు గురించి పలు అంశాలను ఈయన ప్రస్తావించారు. కొల్లేరు దండకారణ్య మధ్యలో 100 చతురపు మైళ్ళ వైశాల్యము గల మహా సరస్సు ఒకటి ఉందని రాశారు.

కొల్లేరులో పెద్లింటమ్మ తల్లి ఇలవేల్పుగా పూజలందుకుంటోంది. కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము. శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిషా, అస్సాం, తమిళనాడు ల నుండి సైతం భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు. ఇలా కొల్లేరు అత్యద్భుతమైన పక్షులకు ఆలవాలంగా ఉంది. ఇంతటి ప్రాచుర్యం ఉన్న కొల్లేరు గత కొంతకాలంలో ఆక్రమణదారుల చేతుల్లో చిక్కి కాలుష్యంగా మారటం ఆందోళనకలిగిస్తోంది.