Video: ఓ పక్క ఆందోళనకారులు బీభత్సం సృష్టిస్తుంటే.. మరోపక్క కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో డ్యాన్స్

జస్టిన్‌ ట్రూడో వీడియో వైరల్ అవుతోంది. ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Video: ఓ పక్క ఆందోళనకారులు బీభత్సం సృష్టిస్తుంటే.. మరోపక్క కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో డ్యాన్స్

Updated On : November 24, 2024 / 7:08 PM IST

ఓ పక్క ఆందోళనకారులు అద్దాలను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టిస్తుంటే, మరోపక్క కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కన్సెర్ట్‌లో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

జస్టిన్‌ ట్రూడోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం రాత్రి టొరంటోలో జరిగిన స్విఫ్ట్ కచేరీలో ట్రూడో డ్యాన్స్ చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అదే సమయంలో డౌన్‌టౌన్ మాంట్రియల్‌లో నాటో వ్యతిరేక, పాలస్తీనా అనుకూల, యూదుల వ్యతిరేక నిరసనలతో హింస చెలరేగింది.

ఆ ప్రాంతంలో జరిగిన వార్షిక అసెంబ్లీకి నాటో ప్రతినిధులు సమావేశం కావడంతో అక్కడే ఆందోళనకారులు నిరసన తెలిపారు. ట్రూడో కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లోని మాంట్రియల్‌లోని పాపినో ఫెడరల్ ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.

కాగా, మాంట్రియల్‌లో జరిగిన హింసను శనివారం ట్రూడో ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. మాంట్రియల్లో జరిగిన ఘటన భయంకరమని అన్నారు. యూదుల వ్యతిరేక, బెదిరింపు, హింసాత్మక చర్యలను మనం ఎక్కడ చూసినా ఖండించాలని ఎక్స్‌లో ట్రూడో పేర్కొన్నారు.

మీరు నా నెత్తిన పెట్టిపోయిన బకాయిలు అక్షరాలా రూ.6,500 కోట్లు: నారా లోకేశ్