The Man Who Flew With The Bird At A Height Of Thousands Of Feet, Saw The Unique Technique Of Flying The Bird
Viral Video : మీరు ఎప్పుడైనా పక్షి ఎగరడం దగ్గరగా చూశారా? అయితే, ఈ వీడియో తప్పక చూడాల్సిందే.. ఎందుకంటే… సాధారణంగా పక్షులు గాల్లో ఎగరడానికి ఎలాంటి టెక్నిక్ ఉపయోగిస్తాయో తెలియకపోవచ్చు. చిన్న పక్షుల నుంచి పెద్ద పక్షుల వరకు గాల్లో ఎగిరే సమయంలో కింద పడిపోకుండా ఉండేందుకు ఎలాంటి టెక్నిక్ ఉపయోగిస్తాయో ఈ వీడియోలో దగ్గరగా చూడవచ్చు. నల్ల రాబందు వేలాది అడుగుల ఎత్తులో గాల్లో ఎగురుతున్న సమయంలో ఈ వీడియోను దగ్గరగా రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక రాబందు పక్షి ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పక్షి ఎగురుతున్న తీరు, అది వాడే టెక్నిక్ ఎంత ప్రత్యేకమైనదో చూడవచ్చు. ది గ్రేట్ ప్లానెట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి పక్షితో వేలాది అడుగుల ఎత్తులో గాలిలో ఎగురుతూ కనిపించాడు. అతను ఎగరడానికి పారాగ్లైడర్ ఎగిరే విట్గ్ ఉపయోగించాడు. అతనితో పాటు ఆ రాబందు కూడా ఎగురుతున్నట్లు కనిపిస్తుంది.. చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
ఆ వీడియోలో గాల్లో ఎగురుతున్న పక్షితో పాటు ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. పచ్చని అడవులు, ఇతర భవనాలు కింద కనిపిస్తున్నాయి. చూడటానికి అది నల్ల రాబందు లేదా డేగ పక్షిగా కనిపిస్తోంది. క్యాప్షన్ ప్రకారం.. పరిశీలిస్తే ఈ దృశ్యం బ్రెజిల్‌లోని సెరా డా ఎరాటానా నుంచి వచ్చింది. సాద్‌లో రాబందులా ఎగురుతున్న పక్షి.. తన శరీరంలోని వెనుక భాగాన్ని అంటే తోక భాగాన్ని పైకి క్రిందికి, కుడి-ఎడమకు సర్దుబాటు చేస్తోంది. తద్వారా అది గాలిలో తన దిశను కూడా సర్దుబాటు చేస్తోంది. ఆశ్చర్యకరంగా.. ఆ పక్షి రెక్కలు చాలా పెద్దవిగా ఉండి ఎలానంటే అలా గాల్లో ఎగిరేందుకు వీలుగా ఉన్నాయి. ఆ రెక్కల మధ్యన గాలి నిండి ఉంటుంది. అందుకే రెక్కలు పదేపేద ఆడించాల్సిన అవసరం లేకుండానే ఎగురుతోంది.
గాల్లో ఎగురుతున్న వ్యక్తి పారాగ్లైడర్‌పై ఆ పక్షి వచ్చి కూర్చొంది. ఆ వ్యక్తి ఆ నల్ల రాబందును నిమరుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు 14 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది అది డేగ కాదని, నల్ల రాబందు అని ధృవీకరించారు. రాబందు ఆ వ్యక్తి పెంచుకుంటున్నాడేమోనని చాలా మంది అంచనా వేశారు. ఎందుకంటే ఆ రాబందు పాదాలకు ట్యాగ్ ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన చాలామంది నెటిజన్లు ప్రమాదవశాత్తూ రాబందు పారాచూట్‌పై పడితే అది పేలిపోతుందని హెచ్చరిస్తున్నారు.
Read Also :Viral video: ఎన్నాళ్లకు కలిశామో.. కోతుల మధ్య ఆప్యాయతలు చూడండి.. ఫిదా అవుతారు