×
Ad

చిక్కదు, దొరకదు.. ముప్పుతిప్పలు పెడుతున్న రాకూన్.. మద్యం మత్తులో ఈ జంతువు ఏం చేసిందంటే?

ఓ రాకూన్‌ మద్యం దుకాణంలో చొరబడి ఆల్కహాల్ తాగింది. కరాటే స్టూడియోలో చొరబడి ట్రైనింగ్ స్టూడియోలోకి ప్రవేశించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్ లోకి చొరబడి అక్కడి స్నాక్స్ తింది.

Raccoon: రాకూన్.. ఇది ఓ విదేశీ జంతువు. ఇవి ప్రధానంగా ఉత్తర అమెరికా ప్రాంతాలకు చెందిన స్వదేశీ జంతువులు. అడవుల్లో, పట్టణ ప్రాంతాల సమీపంలో కూడా అక్కడ బాగా కనిపిస్తాయి. ఇటీవల అమెరికాలో ఓ రాకూన్ చేసిన దొంగ పనులు చర్చనీయాంశంగా మారాయి.

వర్జీనియాలో ఒక దుకాణంలోకి చొరబడి మద్యం షెల్ఫ్‌లలో ఉన్న ఆల్కహాల్‌ను హ్యాపీగా తాగింది. వరుసగా మరిన్ని చోరీలు చేసింది. అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తున్న ఆ రాకూన్‌ను ఎవరూ పట్టుకోలేకపోతున్నారు.

హానోవర్ జంతు నియంత్రణ అధికారి సమంతా మార్టిన్ మాట్లాడుతూ.. “గీతల తోకతో ఉన్న ఆ రాకూన్‌ ఇక్కడి సమీపంలోని కరాటే స్టూడియోలోకి కూడా చొరబడిందని అనుమానిస్తున్నాం. ఆపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్ నుంచి స్నాక్స్ దోచుకుని వెళ్లింది. ఇది రాకూన్ చేసిన మూడో చోరీలా అనిపిస్తోంది” అని అధికారి సమంతా మార్టిన్ చెప్పారు.

Also Read: భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌పై అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం.. ఆ సుంకాలు ఎత్తేస్తారా?

“ట్రాష్డ్ పాండా” అనే పేరుతో ఆ రాకూన్‌ను పిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆష్‌లాండ్ మద్యం దుకాణం బాత్‌రూంలో మత్తులో పడిపోయి కనిపించింది. ఆ రాకూన్‌కి మత్తు తగ్గిన తరువాత ఇక్కడి సిబ్బంది దాన్ని అడవిలోకి విడిచిపెట్టారు. ఆ తర్వాత అది మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించింది.

సాధారణంగా ఈ రాకూన్‌లు చెత్త డబ్బాల్లో ఆహారం వెతుక్కుంటాయి. చెత్త డబ్బాల్లోకి చొరబడే అలవాటు కారణంగా రాకూన్‌లకు “ట్రాష్ పాండా” అనే ముద్దుపేరు ఉంది.

ఒక తాజా అధ్యయనం ప్రకారం.. రాకూన్లు మనుషులు ఉండే ప్రాంతాల్లోనూ సౌకర్యంగా ఉంటున్నాయి.

భవనాల్లోకి రాకూన్‌ రావడం ఇది తొలిసారి కాదని అని అధికారులు తెలిపారు. రాకూన్‌ కరాటే స్టూడియోలోనూ కనపడిందని, ఒకసారి డీఎంవీ లోపలికి వెళ్లి అక్కడి స్నాక్స్ తిందని చెప్పారు.

గతంలోనూ ఇలాగే పలు చోరీలు జరిగాయి. వాటిని కూడా ఈ రాకూనే చేసిందా? ఇతర రాకూన్లు చేశాయా? అన్న అనుమానాలు వస్తున్నాయని అధికారులు చెప్పారు.

రాకూన్ చేస్తున్న చోరీలపై అందరూ మాట్లాడుకుంటున్నారని అన్నారు. త్వరలోనే మరో చోరీ చేస్తూ రాకూన్‌ పట్టుబడే అవకాశం ఉందని చెప్పారు. రాకూన్లు తెలివైనవి, చేతుల్లాంటి ముందు కాళ్లతో వస్తువులు పట్టుకోగలుగుతాయి. వాటి స్వభావం, జీవన విధాన పరంగా రాకూన్లు కుక్కలకంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి.