PM Modi Warns Pakistan: పాకిస్తాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. బుల్లెట్ దిగిపోద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ తో తీవ్ర ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ సీరియస్ కామెంట్స్ చేశారు. అక్కడి నుంచి బుల్లెట్ వస్తే.. ఇక్కడి నుంచి బుల్లెట్లు వర్షం కురుస్తుంది అని పాక్ ను హెచ్చరించారు మోదీ.
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో.. తీవ్రంగా స్పందించారు ప్రధాని మోదీ. కాల్పులను పాక్ ఆపితేనే.. భారత్ కూడా ఆపుతుందని మోదీ తేల్చి చెప్పారు. పాకిస్తాన్ దురాక్రమణకు భారత్ నుంచి ప్రతిస్పందన మరింత బలంగా ఉంటుందన్నారు.
మే 7న పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ మెరుపు దాడుల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ భారత్ వైఖరిని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కాల్పులు జరిపితే, భారత్ మరింత బలంగా స్పందిస్తుందన్నారు. పాకిస్తాన్ ఆగిపోతే, ఇండియా ఆగిపోతుందన్నారు.
భారత్, పాకిస్తాన్ కాల్పులు, సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పిన కొన్ని గంటల్లో పాక్ రెచ్చిపోయింది. కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత్ పై దాడులు చేసింది. ఈ క్రమంలో పాక్ ను హెచ్చరిస్తూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: పాకిస్తాన్‌పై భారత్ వాటర్ వార్.. ఒక్కసారిగా ఆ డ్యామ్‌ల గేట్లు ఎత్తివేత..
పాకిస్తాన్‌తో చర్చలు DGMOల ద్వారానే జరుగుతాయని ప్రభుత్వ ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి. చర్చించడానికి వేరే సమస్య లేదు, కాశ్మీర్‌కు సంబంధించిన ఏకైక విషయం. పాకిస్తాన్ తన అక్రమ ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని తిరిగి ఇవ్వడం మాత్రమే అని తెలిపాయి. DGMOలు భారత సైన్యంలోని సీనియర్ అధికారులు, సాధారణంగా లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉంటారు. భారత్, దాని సరిహద్దుల్లోని అన్ని సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత వహిస్తారు.
కాల్పుల విరమణ తర్వాత సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై త్రివిధ దళాలతో ప్రధాని మోదీ చర్చించారు. పాక్ రెచ్చగొట్టే చర్యలను ప్రధానికి వివరించారు త్రివిధ దళాధిపతులు. పాక్ కు ఎలాంటి కండీషన్స్ పెట్టాలన్నదానిపైనా చర్చ జరిగింది. ఈ సమావేశంలో గతంలో వచ్చిన యుద్ధాల ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు ప్రధాని మోదీ. ”ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించబోదు. పాక్ దాడి చేస్తే భారత్ నుంచి ప్రతిదాడి తీవ్రంగా ఉంటుంది” అని వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ.